HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >China Appoints Dong Jun As New Defence Minister

China Defence Minister: చైనా నూతన రక్షణ మంత్రిగా డాంగ్‌ జున్‌.. షాంగ్‌ఫు ఏమయ్యారు..?

చైనా రక్షణ మంత్రి (China Defence Minister) లీ షాంగ్‌ఫు అదృశ్యమైనప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. లీ షాంగ్‌ఫు అదృశ్యమయ్యారా..? లేదా అదృశ్యం చేశారా అనేది కూడా అతిపెద్ద రహస్యం.

  • Author : Gopi Date : 30-12-2023 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Defence Minister
Safeimagekit Resized Img (1) 11zon

China Defence Minister: చైనా రక్షణ మంత్రి (China Defence Minister) లీ షాంగ్‌ఫు అదృశ్యమైనప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. లీ షాంగ్‌ఫు అదృశ్యమయ్యారా..? లేదా అదృశ్యం చేశారా అనేది కూడా అతిపెద్ద రహస్యం. చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు సజీవంగా ఉన్నాడా లేదా అనేదానికి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆగస్టు 2023 నుంచి చైనా రక్షణ మంత్రి ఎక్కడా కనిపించలేదు. కాగా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన కొత్త రక్షణ మంత్రిగా డాంగ్ జున్‌ను ఎన్నుకున్నారు. దీంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

చైనా శుక్రవారం నేవీ కమాండర్ జనరల్ డాంగ్ జున్‌ను తన కొత్త రక్షణ మంత్రిగా నియమించింది. రెండు నెలల క్రితం ఎటువంటి వివరణ లేకుండా జనరల్ లీ షాంగ్‌ఫును తొలగించారు. చైనా అత్యున్నత శాసనసభ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC).. అక్టోబర్‌లో లీ తొలగింపును ధృవీకరించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (PLAN) కమాండర్ డాంగ్‌ను రక్షణ మంత్రిగా NPC స్టాండింగ్ కమిటీ నియమించినట్లు అక్కడి అధికారిక మీడియా నివేదించింది. మీడియా ప్రకారం.. డాంగ్ అన్ని ప్రధాన నౌకాదళ విభాగాలలో పనిచేశాడు. అయితే, అతని వయస్సు గురించి సమాచారం ఇవ్వలేదు.

Also Read: Lakhbir Singh Landa: లఖ్బీర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్.. ఎవరీ లఖ్బీర్ సింగ్ లాండా..?

డాంగ్ జున్ ఎవరు..?

హాంకాంగ్ నుండి ప్రచురించబడిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వార్తల ప్రకారం.. 2021లో నావికాదళం టాప్ కమాండర్ కావడానికి ముందు, డాంగ్ రష్యన్ నేవీతో సాధారణ విన్యాసాలు నిర్వహించే నార్తర్న్ మారిటైమ్ ఫ్లీట్‌లో పనిచేశాడు. అతను జపాన్‌తో సంభావ్య సంఘర్షణలపై దృష్టి సారించిన తూర్పు నౌకాదళంలో కూడా పనిచేశాడు. డాంగ్ దక్షిణ చైనా సముద్రం భద్రతకు బాధ్యత వహించే సదరన్ కమాండ్ లో కూడా పనిచేశాడు. అత్యున్నత రక్షణ పదవులకు నియామకాలను చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆమోదించారు.

We’re now on WhatsApp. Click to Join.

పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) ప్రధాన కార్యదర్శిగా ఉండటమే కాకుండా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)కి కూడా అధిపతిగా ఉన్నారు. లీ కంటే ముందు విదేశాంగ మంత్రి చిన్ కాంగ్‌ను కూడా ఎటువంటి కారణం లేకుండా అతని పదవి నుండి తొలగించారు. కాంగ్ స్థానంలో విదేశాంగ మంత్రిగా వాంగ్ యి నియమితులయ్యారు. వాంగ్ ఈ సంవత్సరం ప్రారంభంలో చిన్ స్థానంలో ఉన్నాడు. లీ, చిన్‌ల ఆచూకీ తెలియలేదు. లీ ఆగస్ట్ చివరి నుండి బహిరంగంగా కనిపించలేదు. అతనిని తొలగించడానికి ఎటువంటి కారణం కూడా చెప్పలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beijing
  • china
  • China Defence Minister
  • defence minister
  • Dong Jun
  • world news

Related News

Ceasefire Deadline

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Iran-US Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Ceasefire Deadline

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd