Iran Hit List : ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ హిట్ లిస్ట్.. ఏ1గా బెంజమిన్ నెతన్యాహూ
ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో వందలాది మంది హిజ్బుల్లా కీలక కమాండర్లు(Iran Hit List) హతమయ్యారు.
- By Pasha Published Date - 02:49 PM, Thu - 3 October 24

Iran Hit List : ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇజ్రాయెల్ పొరుగునే లెబనాన్ ఉంటుంది. ఇరాన్ ప్రేరేపిత మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా లెబనాన్‌లో యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్ లోపల ఇజ్రాయెల్ భూతల దాడిని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్ లోపలికి దాదాపు 4 కిలోమీటర్ల మేర చొరబడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో వందలాది మంది హిజ్బుల్లా కీలక కమాండర్లు(Iran Hit List) హతమయ్యారు. వారందరి ఫొటోలు, హోదాల వివరాలతో ఇజ్రాయెల్ ఆర్మీ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పోస్టులు విడుదల చేసింది. దీన్ని కౌంటర్ చేసేందుకు ఇరాన్ అనుకూల వర్గాలు అదే తరహా ప్రచారానికి తెరతీసింది.
Also Read :Fake SBI Branch : ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్ బట్టబయలు.. రూ.లక్షలు కుచ్చుటోపీ.. ఉద్యోగాలు అమ్ముకున్న వైనం
తమ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై ఇజ్రాయెల్ విద్వేష ప్రచారం చేస్తున్నందుకు ప్రతీకారంగా ఓ పోస్టును ఇరాన్ అనుకూల వర్గాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాయి. ఇరాన్ అంతమొందించనున్న ఇజ్రాయెల్ ఉగ్రవాదుల జాబితా అని ఆ పోస్ట్‌కు టైటిల్ పెట్టారు., ఇందులో మొదటి ప్లేస్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఫొటో, పేరు ఉన్నాయి. తర్వాత వరుసగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గెలెంట్, ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌ల పేర్లు, ఫొటోలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన కొందరు కీలక ఉన్నతాధికారుల పేర్లు, ఫొటోలను సైతం ఈ లిస్టులో పొందుపరిచారు. హిజ్బుల్లా ఫైటర్లకు మరణాలకుగానూ వీరందరిపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. దీనిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ లిస్టును ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒకవేళ ఇది నిజమైనదే అయితే.. వారందరిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తుందా అనేది వేచిచూడాలి.