Hirsh Vardhan Singh: అమెరికా అధ్యక్ష రేసులో మరో ప్రవాస భారతీయుడు.. ఎవరీ హర్ష్‌వర్దన్ సింగ్..?
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన ఈ అమెరికన్ వ్యక్తి పేరు హర్ష్‌వర్దన్ సింగ్ (Hirsh Vardhan Singh).
- By Gopichand Published Date - 02:03 PM, Sun - 30 July 23

గురువారం హర్ష్‌వర్దన్ సింగ్ (38) తన అభ్యర్థిత్వాన్ని ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేయడం ద్వారా ప్రకటించారు. ఈ సమయంలో అతను తనను తాను రిపబ్లికన్‌గా అభివర్ణించుకున్నాడు. అతను 2017లో న్యూజెర్సీలో రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడంలో సహాయం చేశాడు. హర్ష్‌వర్దన్ సింగ్ తనను తాను ఏకైక అమెరికన్ అభ్యర్థి అని కూడా చెప్పుకున్నాడు. కరోనా కాలంలో కూడా తాను అధైర్య పడలేదని, ఎప్పుడూ అమెరికా ప్రయోజనాల కోసం పనిచేశానని చెప్పారు.
I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW
— Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023
అభ్యర్థిత్వం దాఖలు
ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను సరిదిద్దడానికి, అమెరికా విలువలను పునరుద్ధరించడానికి మనకు బలమైన నాయకత్వం అవసరమని హర్ష్‌వర్దన్ సింగ్ అన్నారు. అందుకే 2024 ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ నుంచి నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ది హిల్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. హర్షవర్ధన్ గురువారం ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు అధికారికంగా తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు.
హర్ష్‌వర్దన్ సింగ్ ఎవరో తెలుసా?
హర్ష్‌వర్దన్ సింగ్ ప్రాథమికంగా భారతీయుడు. 2009లో న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. వృత్తిరీత్యా ఇంజనీర్. 38 ఏళ్ల సింగ్ ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. అతను 2017లో గవర్నర్ అభ్యర్థిగా న్యూజెర్సీ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అయితే, అతనికి అప్పుడు సక్సెస్ రాలేదు. కేవలం 9.8 శాతం ఓట్లు మాత్రమే సాధించి రేసులో మూడో స్థానంలో నిలిచాడు. అతను 2003లో అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ద్వారా ఏవియేషన్ అంబాసిడర్‌ను అందుకున్నాడు.