Air Pollution: థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం.. 13 లక్షల మందికి పైగా అస్వస్థత
వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా థాయ్‌లాండ్‌లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల దాదాపు 200,000 మంది అస్వస్థతకు గురయ్యారు. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.
- By Gopichand Updated On - 10:00 AM, Tue - 14 March 23

వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా థాయ్‌లాండ్‌లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల దాదాపు 200,000 మంది అస్వస్థతకు గురయ్యారు. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం. మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంకాక్ హానికరమైన వాయు కాలుష్యంలో మునిగిపోయింది. ప్రజలకు విషపూరితమైన గాలి పీల్చడం తప్ప మరో మార్గం లేదు.
నివేదిక ప్రకారం.. వాయుకాలుష్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. దీంతో పాటు ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. పరిశ్రమ నుంచి వెలువడే పొగ, వాహనాల నుంచి వెలువడే పసుపు-బూడిద పొగ కారణంగా ఈ కాలుష్యం వ్యాపించిందని ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. వాయు కాలుష్యం కారణంగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి 13 లక్షల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. మంత్రిత్వ శాఖలోని డాక్టర్ క్రియంగ్‌క్రై నమ్‌థైసోంగ్ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలను ఇంట్లోనే ఉండాలని సూచించారు. దీంతో పాటు రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: Freddy Storm: ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 100 మంది మృతి
అధిక నాణ్యత గల N95 యాంటీ పొల్యూషన్ మాస్క్‌లను ధరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులకు సూచించింది. పరిస్థితి మరింత దిగజారితే కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయని బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిటిపుంట్ ప్రతినిధి తెలిపారు. చిన్నపిల్లల భద్రత కోసం నగరంలో నిర్వహించే నర్సరీల్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లతో పాటు ‘నో డస్ట్‌రూమ్‌లు’ కూడా ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకాక్‌లోని 50 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరమైన PM2.5 స్థాయిలు నమోదయ్యాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని స్థాయి WHO మార్గదర్శకం కంటే చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితిలో గాలిలో ఉన్న కణాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. గాలిలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) మానవ ఊపిరితిత్తులకు విషం లాంటిదని, తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుందని చెబుతున్నారు. అవి అకాల మరణానికి కూడా కారణమవుతాయని అధికారులు తెలుపుతున్నారు.

Related News

Terrorists: ఉగ్రవాదుల చేతిలో పాక్ గూఢచారి హతం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
వాయవ్య పాకిస్థాన్ లో మంగళవారం ఉగ్రవాదుల (Terrorists)తో జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఇంటెలిజెన్స్ అధికారి మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ సైన్యం తెలిపింది.