ట్రంప్‌కు భారీ షాక్ ఇచ్చిన సెనెట్!!
శుక్రవారం (మార్చి 19, 2026) జరిగిన ఈ ఓటింగ్ ఫిబ్రవరి 12, 2026 తర్వాత ఐదవ ప్రయత్నం. హౌస్ ఆమోదించిన ఈ బిల్లును సెనెట్‌లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా సెప్టెంబర్ వరకు ఆ విభాగానికి నిధులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- Author : Gopichand
Date : 22-03-2026 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
Donald Trump: అమెరికా మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొనాలనే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ పరిపాలన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కోసం అమెరికన్ కాంగ్రెస్ నుండి నిధులను కోరింది. అయితే ఈ బిల్లు సెనెట్‌లో తిరస్కరణకు గురైంది. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలోని డెమొక్రాటిక్ పార్టీని ‘కట్టర్ వామపక్షం’ అని అభివర్ణించారు.
సెనెట్ తిరస్కరించిన DHS బిల్లు ఏమిటి?
వాస్తవానికి అమెరికన్ సెనెట్ శుక్రవారం (మార్చి 19, 2026) నాడు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి (DHS) నిధులు మంజూరు చేసే బిల్లును మరోసారి ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైంది. దీనివల్ల గతంలోనే ప్రారంభమైన ‘షట్‌డౌన్’ అలాగే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Also Read: Crashed Helicopter : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఈ బిల్లును సెనెట్‌లో ఆమోదించడానికి 60 ఓట్లు అవసరం. కానీ ఓటింగ్ ఫలితాలు 47-37గా రావడంతో ఇది అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. కాగా 16 మంది సెనెటర్లు ఓటింగ్‌లో అసలు పాల్గొనలేదు. మరోవైపు పెన్సిల్వేనియాకు చెందిన డెమొక్రాటిక్ సెనెటర్ జాన్ ఫెటర్మ్యాన్ రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.
శుక్రవారం (మార్చి 19, 2026) జరిగిన ఈ ఓటింగ్ ఫిబ్రవరి 12, 2026 తర్వాత ఐదవ ప్రయత్నం. హౌస్ ఆమోదించిన ఈ బిల్లును సెనెట్‌లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా సెప్టెంబర్ వరకు ఆ విభాగానికి నిధులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఫిబ్రవరి 14, 2026 నుండి ‘షట్‌డౌన్’ స్థితిలోనే కొనసాగుతోంది.