HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >A Crisis Is Looming Oil Market Enters The Red Zone

Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
A Crisis Is Looming... Oil Market Enters the 'Red Zone'
A Crisis Is Looming... Oil Market Enters the 'Red Zone'

తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా ‘రెడ్ జోన్’ లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాబోయే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, మరోవైపు చమురు సరఫరా నిలిచిపోవడంతో త్వరలోనే మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించబోతున్నాయని ఐఈఏ చీఫ్‌ ఫాతిహ్‌ బిరోల్‌ స్పష్టం చేశారు. లండన్‌లో నిర్వహించిన ప్రపంచ ఇంధన భద్రత ప్రత్యేక సదస్సులో పాల్గొన్న ఆయన… ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగానే ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం తలెత్తిందని బిరోల్ విశ్లేషించారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే.. గ్లోబల్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్ముజ్ జలసంధి’ని ఎలాంటి షరతులు లేకుండా, పూర్తిగా తిరిగి తెరవడమే ఏకైక పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. ఒకవేళ పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచ సరఫరాను శాసించే ఈ హర్మూజ్ జలసంధిని యథాతథంగా తెరవడంలో విఫలమైతే, గ్లోబల్ చమురు సరఫరా లింక్ పూర్తిగా కట్ అవుతుందని… దీనివల్ల వివిధ దేశాల్లో ఉన్న అత్యవసర చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని ఆయన వివరించారు.

సంక్షోభానికి గల ప్రధాన కారణాలు:

  • వేగంగా కరిగిపోతున్న మిగులు నిల్వలు: ఈ ఇంధన సంక్షోభం ప్రారంభమైన కొత్తలో ప్రపంచ దేశాల వద్ద అవసరానికి మించి మిగులు చమురు నిల్వలు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా అవి వేగంగా కరిగిపోతున్నాయి.
  • సమ్మర్ డిమాండ్ ఎఫెక్ట్: దీనికి తోడు రాబోయే వేసవి కాలంలో ప్రయాణాలు విపరీతంగా పెరిగి ఇంధనానికి డిమాండ్ ఊహించని రేంజ్‌లో ఎక్కువ కానుంది.

సరఫరా లేకపోవడం, డిమాండ్ విపరీతంగా పెరగడం అనే ఈ రెండు కారణాల వల్ల రాబోయే జులై లేదా ఆగస్టు నెలల నాటికి ప్రపంచ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే గండం పొంచి ఉందని బిరోల్ హెచ్చరించారు. ఈ ఇంధన సంక్షోభం గనుక ముదిరితే భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Energy Crisis
  • Energy Crisis 2026
  • global economy
  • Hormuz Strait
  • Hormuz Strait Crisis
  • IEA
  • International Energy Agency
  • oil crisis
  • Oil Crisis 2026

Related News

Good News for HDFC Employees

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రైవేటు బ్యాంకు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన ఉద్యోగులకు రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని, కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఆ మేరకు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కస్టమర్

    Latest News

    • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

    • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

    • Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd