Terror Attack in Pakistan: పాకిస్తాన్ ఉగ్రదాడిలో 8మంది భద్రతా సిబ్బంది మృతి..!
- Author : hashtagu
Date : 18-11-2022 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో 8మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పోలీసులు ఇద్దరు సైనికులు ఉన్నారని పాకిస్తాన్ స్థానిక వార్త పత్రిక డాన్ నివేదించింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ నిషేధిత తెహ్రీక్ ఇ తాలిబన్ ప్రటికటించింది. కుర్రం పర్ ప్రాంతంలో ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మరణించారు. మరో ఘటన బజౌర్ జిల్లాలో జరిగింది. ఈ ఘర్షణ లో ఇద్దరు సైనికులతోపాటు ఒక ఉగ్రవాది మరణించాడు.
ఈ ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ ట్వీట్ చేవారు. మనం ఎలాంటి తప్పులు చేయవద్దు. ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రధాన సమస్యల్లో ఒకటి. మన సాయుధ బలగాలు, పోలీసులు ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలంటూ ట్వీట్ చేశారు.