Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు
అయితే కొందరు ఉపాధ్యాయులు, వైద్యులు(Surgeon Vs 299 Patients) తమ ప్రొఫెషన్స్‌కు కళంకం తెస్తున్నారు.
- By Pasha Published Date - 11:13 AM, Tue - 25 February 25

Surgeon Vs 299 Patients : ఉపాధ్యాయుడు, వైద్యుడు.. ఈ రెండు ప్రొఫెషన్స్‌లో ఉండేవారికి సమాజంలో చాలా గౌరవం దక్కుతుంది. వీరిని దైవ సమానంగా చూస్తారు. వైద్యుడిని ప్రాణం పోసేవాడిగా భావిస్తారు. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చే మహోన్నతుడిగా ఉపాధ్యాయుడిని పరిగణిస్తారు. అందుకే ఈ స్థానాల్లో ఉండేవారు చాలా బాధ్యతగా మసులుకోవాలి. ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండాలి. అయితే కొందరు ఉపాధ్యాయులు, వైద్యులు(Surgeon Vs 299 Patients) తమ ప్రొఫెషన్స్‌కు కళంకం తెస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చే ఓ నీచ డాక్టరు బాగోతం గురించి మనం తెలుసుకోబోతున్నాం..
Also Read :BJP Vs Shinde: ‘‘తేలిగ్గా తీసుకోవద్దు’’ అంటున్న షిండే.. ‘మహా’ సంచలనం తప్పదా ?
నీచ డాక్టర్ పాపాల చిట్టా ఇదిగో
- అతడి పేరు జోయెల్ లి స్కౌర్నెక్. వయసు 74 ఏళ్లు.
- ఫ్రాన్స్ దేశానికి చెందిన జోయెల్ లి స్కౌర్నెక్ ఒక మెడికల్ సర్జన్.
- ఫ్రాన్స్‌లోని బ్రిటానీ ప్రాంతంలో ఉన్న ఒక ఆస్పత్రిలో జోయెల్ దాదాపు 30 ఏళ్ల పాటు సర్జన్‌గా పని చేశాడు.
- ఆ 30 ఏళ్లలో అతగాడు 299 మంది రోగులపై అత్యాచారం చేశాడట. జోయెల్ బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలే.
- తాను సర్జరీ చేసిన వాళ్లు, మత్తులో ఉండగా జోయెల్ లైంగిక దాడి చేసేవాడట.
- అతడి అకృత్యాలు 2017లో వెలుగుచూశాయి.
- పొరుగు ఇంట్లో ఉన్న ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించడంతో జోయెల్‌పై ఆ ఏడాది కేసు నమోదైంది.
- జోయెల్ లి స్కౌర్నెక్ చేసిన సెక్స్ స్కాంపై ఫ్రాన్స్ ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించింది.
- 2017లో ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు జోయెల్ ఇంట్లో రైడ్స్ చేశారు. ఆ ఇంట్లో 3 లక్షలకుపైగా ఫొటోలు, 650కిపైగా అశ్లీల వీడియోలు దొరికాయి.
- జోయెల్ బాధితుల్లో చాలామంది ముందుకు వచ్చి, తమపై అతడు రేప్ చేశాడని కోర్టుకు తెలిపారు.
- జోయెల్ కూడా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్యకాలంలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై రేప్ చేశానన్నాడు.
- 2020లో ఫ్రాన్స్‌లోని ఓ కోర్టు జోయెల్‌ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
- ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ఉన్నత స్థాయి కోర్టులో జోయెల్ వ్యవహారంపై ఇంకా లోతుగా విచారణ జరుగుతోంది. అతడు దోషిగా తేలితే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది.