HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The First Hyperloop Test Track In Our Country Is Ready What Is Hyperloop How Does It Work

Hyperloop Track : తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ.. ఏమిటిది ? ఎలా పనిచేస్తుంది ?

‘హైపర్‌ లూప్’(Hyperloop Track) అంటే ప్రత్యేకమైన వాక్యూమ్ ట్యూబ్.

  • By Pasha Published Date - 09:29 AM, Tue - 25 February 25
  • daily-hunt
Hyperloop Track hyperloop Test Delhi To Jaipur India Railways   

Hyperloop Track : బుల్లెట్ రైలు గంటకు 450 కి.మీ వేగంతో నడుస్తుంది. హైపర్‌లూప్‌లోని రైళ్లు ఏకంగా గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇప్పుడు దేశంలోనే తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్  పూర్తిగా రెడీ అయింది.  దీన్ని ఐఐటీ మద్రాస్ తయారు చేసింది. ఈ ట్రాక్ పొడవు 410 మీటర్లు. దీన్ని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోనే నిర్మించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత రైల్వేశాఖ ఆర్థిక సహాయం అందించింది. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ‘ఆవిష్కార్‌ హైపర్‌లూప్‌’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి ఈ హైపర్ లూప్ ట్రాక్‌ను తయారు చేశారు. ఇందులో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ హైపర్‌లూప్ ట్రాక్‌పై త్వరలో ట్రయల్ రన్‌లు ప్రారంభమవుతాయి. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే ఈ అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను మనదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు.

Also Read :Govt Banks : ఐదు గవర్నమెంటు బ్యాంకుల్లో వాటాల అమ్మకం.. కీలక అప్‌డేట్

‘హైపర్‌ లూప్’ అంటే ఏమిటి ? 

‘హైపర్‌ లూప్’(Hyperloop Track) అంటే ప్రత్యేకమైన వాక్యూమ్ ట్యూబ్. ఈ ట్యూబ్‌లో  ప్రత్యేకమైన రైల్వే ట్రాక్ ఉంటుంది. ‘‘హైపర్‌లూప్‌ ట్యూబ్‌లోని ‘లూప్‌’ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్‌. పాడ్‌ అనే మరో భాగం కూడా ఇందులో ఉంటుంది. ఇది రైలు బోగీ లాంటి వాహనం. టెర్మినల్‌ అంటే హైపర్‌లూప్‌ బోగీలు ఆగే ప్రదేశం.  హైపర్ లూప్ ట్రాక్‌పై నుంచి అధిక వేగంతో రైలు దూసుకుపోతుంది. దీనివల్ల  ఎలాంటి  ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా రైళ్లను నడిపే అవకాశం కలుగుతుంది.  ఫలితంగా ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. రైలు వేగం పెరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి ముంబైకి, ముంబై నుంచి పూణేకు, హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం అరగంటలోనే మనం చేరుకోవచ్చు.

Also Read :Top 10 Tourist Places: దేశంలోని టాప్ -10 టూరిస్టు ప్రదేశాల్లో హైదరాబాద్ హవా

రైల్వేశాఖ ట్వీట్ 

వాక్యూమ్ ట్యూబ్‌లో ప్రయాణం జరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఈ వాక్యూమ్ ట్యూబ్‌లోని రైలులో ప్రయాణించే వారి కోసం ఆక్సిజన్ వసతి, వెంటిలేషన్ సౌకర్యం ఉంటాయి. కాబట్టి ఇందులో సేఫ్‌గా ప్రయాణించొచ్చు. దేశంలోనే తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వీడియోను తాజాగా భారతదేశ రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా విడుదల చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bullet train
  • Delhi To Jaipur
  • High speed trains
  • Hyperloop Test
  • Hyperloop Track
  • india
  • India Railways

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

  • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

  • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd