BJP Vs Shinde: ‘‘తేలిగ్గా తీసుకోవద్దు’’ అంటున్న షిండే.. ‘మహా’ సంచలనం తప్పదా ?
ఈ కామెంట్స్‌కు అర్థం ఏమిటి ? షిండే(BJP Vs Shinde) ఏం చేయబోతున్నారు ? అనే దిశగా ఇప్పుడు చర్చ నడుస్తోంది.
- By Pasha Published Date - 10:30 AM, Tue - 25 February 25

BJP Vs Shinde: మహారాష్ట్రలోని ‘మహాయుతి కూటమి’లో ఉన్న రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతోంది. బీజేపీ, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోని శివసేన మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. త్వరలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర రాజకీయం ఏ క్షణాన ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టతరంగా మారింది.స్థానిక ఎన్నికల్లోగా మహాయుతి కూటమి నుంచి తమను సాగనంపేందుకు బీజేపీ స్కెచ్ గీసిందని షిండే శివసేన ఎమ్మెల్యేలు అంటున్నారు.
Also Read :Hyperloop Track : తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ.. ఏమిటిది ? ఎలా పనిచేస్తుంది ?
‘‘నన్ను తేలిగ్గా తీసుకోవద్దు’’ : షిండే
ఒకవేళ కూటమి నుంచి షిండే శివసేన బయటికి వస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఒంటరిగా పోటీ చేస్తుందా ? ఇంకేదైనా అనూహ్య నిర్ణయం తీసుకొని బీజేపీకి షాక్ ఇస్తుందా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. షిండే శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే ఇటీవలే చేసిన సంచలన వ్యాఖ్యలపైనే రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ‘‘నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. 2022లో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టింది నేనే’’ అని షిండే వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌కు అర్థం ఏమిటి ? షిండే(BJP Vs Shinde) ఏం చేయబోతున్నారు ? అనే దిశగా ఇప్పుడు చర్చ నడుస్తోంది.
Also Read :Govt Banks : ఐదు గవర్నమెంటు బ్యాంకుల్లో వాటాల అమ్మకం.. కీలక అప్‌డేట్
రాజకీయ కక్ష సాధింపులకు భయపడి..
ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో ఏక్‌నాథ్ షిండే కీలక పాత్ర పోషించారు. అయినా ఆయనకు సీఎం పదవిని కేటాయించలేదు. దాన్ని బీజేపీయే తీసుకుంది. నాటి నుంచే బీజేపీ పెద్దలపై షిండే గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు మహాయుతి కూటమి నుంచి వైదొలగితే.. కేంద్రంలోని మోడీ సర్కారు రాజకీయ కక్ష సాధింపులకు దిగొచ్చనే భయం షిండే వర్గంలో ఉంది. షిండే వర్గం ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను తిరగదోడటంతో పాటు షిండే వర్గం మంత్రుల స్కాంలను బయటికి తీయడంపై బీజేపీ ఫోకస్ చేసే ముప్పు ఉంది. అందుకే ఏక్‌నాథ్ షిండే ధైర్యంగా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతున్నారు.
జనతా దర్బార్‌తో రాజకీయ రగడ
ఏక్‌నాథ్ షిండే సొంత జిల్లా థాణే. అక్కడ పాగా వేయాలనే స్కెచ్‌తో బీజేపీ ఉంది. ఈక్రమంలోనే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్‌ను థాణే జిల్లాకు పంపింది. ఆయన థాణే జిల్లాలో జనతా దర్బార్ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ అంశాన్ని జిల్లాకు చెందిన షిండే వర్గం ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. థాణేలో గణేశ్ నాయక్ ప్రవేశిస్తే, షిండేకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందనే భావన షిండే శివసేన క్యాడర్‌లో ఉంది. అందుకే వారు కీలక ప్రకటన చేశారు. తాము నవీ ముంబైలో జనతా దర్బార్ నిర్వహిస్తామని షిండే గ్రూపు నేతలు ప్రకటించారు.