HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >55 Chinese Sailors Dead As Submarine Gets Stuck In Trap For Foreign Vessels

55 Sailors Dead : ‘సముద్ర ఉచ్చు’కు 55 మంది చైనా సబ్‌మెరైనర్ల మృతి.. ఏం జరిగింది ?

55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది.

  • By Pasha Published Date - 12:48 PM, Wed - 4 October 23
  • daily-hunt
55 Sailors Dead
55 Sailors Dead

55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది. ఆ ఉచ్చులో చిక్కుకొని చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘093-417’లోని మొత్తం 55 మంది  సిబ్బంది బలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 21న ఉదయం 8:12 గంటలకు చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో ఈ ప్రమాదం జరిగిందని బ్రిటన్ ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై బ్రిటన్ మీడియాలో సంచలన కథనాలు పబ్లిష్ అయ్యాయి. అయితే ఈ వార్తలను చైనా కొట్టిపారేసింది. అలాంటి ప్రమాదమేమీ జరగలేదని తేల్చి చెప్పింది.  బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. చైనా సబ్ మెరైన్ సముద్రం లోపల ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత.. దాని సిస్టం ఫెయిలైంది. ఆ సబ్ మెరైన్ కు మరమ్మతులు చేసి ఉపరితలానికి తీసుకురావడానికి దాదాపు  6 గంటల టైం పట్టింది. అప్పటికే సబ్ మెరైన్ లోని ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, ఎయిర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలు పనిచేయడం ఆపేశాయి.  ఆక్సీజన్ సరఫరా వ్యవస్థ స్తంభించడంతో.. దానిలోపల ఉన్న 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు చనిపోయారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ప్రమాదంపై  చైనా నోరు మెదపకపోవడంతో ఆ న్యూక్లియర్ సబ్ మెరైన్ నుంచి ఏవైనా అణు పదార్థాలు సముద్రంలోకి లీకయ్యాయా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి  ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్‌ సబ్‌మెరైనర్లు ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే చైనాకు చెందిన క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ఉంది. అక్కడికి అమెరికా, బ్రిటన్‌ జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో చైనా ఈ ట్రాప్ ను ఏర్పాటు చేసింది. దానికి చైనాకే చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘093-417’ చిక్కడంతో ఈ విషాద ఘటన సంభవించింది.

Also read : TDP : వారాహిలో అల్లర్లు సృష్టిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.. వైసీపీకి టీడీపీ నేత య‌ర‌ప‌తినేని హెచ్చరిక‌

ఈ ప్రమాదం జరిగిన రోజునే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం నుంచి హఠాత్తుగా వైదొలిగారు. ఈ క్రమంలో చైనా వాణిజ్య మంత్రి వాంగ్‌ వాక్వింగ్‌ అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని సదస్సుకు చదివి వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సబ్‌మెరైన్‌ ప్రమాద వివరాలు తెలియడంతోనే (55 Sailors Dead)  జిన్‌పింగ్‌ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 55 Chinese sailors dead
  • 55 Sailors Dead
  • china
  • foreign vessels
  • poisoning of the crew
  • submarine stuck in trap
  • UK intelligence report

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd