Reels On Hampi Fort: రీల్స్ కోసం హంపీ కోటపై యువకుడు డాన్స్.. షాకిచ్చిన పోలీసులు!
నేటి యూత్ రీల్స్ (Reels) పేరుతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తున్నారు.
- By Balu J Published Date - 01:37 PM, Tue - 28 February 23

సోషల్ మీడియా (Social Media) వ్యామోహమో.. పాపులర్ కావాలనే ఉత్సాహమో కానీ.. నేటి యూత్ రీల్స్ (Reels) పేరుతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తూ ఇతరులకు భంగం కలిగిస్తున్నారు. 14వ శతాబ్దానికి చెందిన హంపీ (Hampi) కోటలోని హేమకూట కొండలపై ఓ యువకుడు నృత్యం చేస్తూ, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వీడియోలో స్మారక చిహ్నంపైకి డాన్స్ చేయడం కనిపించింది. దీంతో హంపి పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియో ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత వారం విదేశీయుల బృందం హంపిలోని పవిత్ర పురందర మంటపంలో పార్టీలు చేసుకుంటూ కనిపించింది. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా అదనపు గార్డులను విధుల్లోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రీల్స్, వీడియోల కోసం అనేక మంది హంపీ(Hampi)లో ఇలాంటి డాన్సులు, షూట్స్ చేస్తూ చరిత్రకు భంగం కలిగిస్తున్నారు. పోలీసులు అనేక కేసులు నమోదు చేసినా రీల్స్ చేసేవాళ్లు ఆగడాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు.
హంపి (Hampi)లో రోజురోజుకు పర్యాటకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సామాజిక కార్యకర్త ప్రభుపాటిల్ అన్నారు. “జిల్లా యంత్రాంగం మైదానంలో కఠినమైన నిబంధనలను విధించదు. మాకు మరింత మంది భద్రతా సిబ్బంది అవసరం. ప్రస్తుతం వంద మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య 5,000 కి చేరుకుంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన యువకులను పోలీసులు అరెస్టు చేయాలి” అని ఆయన అన్నారు.
#Hampi police are looking for a youth (in video) for violating norms of #ASI and #WorldHeritageSite Case booked against the youth. Locals demand additional security personnel @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @KiranTNIE1 @NammaBengaluroo @NammaKalyana pic.twitter.com/RLFg5DxgQT
— Amit Upadhye (@AmitSUpadhye) February 27, 2023
Also Read: Wife Exchange: ఇదేం పోయేకాలం.. ఆయన భార్య ఈయనతో.. ఈయన భార్య ఆయనతో పరార్!