viral video : ఇయర్‌ఫోన్ ఎపిసోడ్ మళ్లీ రిపీట్..పాక్ ప్రధానికి పుతిన్ ట్యూటర్‌గా మారిన ఘటన వైరల్!
2022లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన SCO సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైనప్పుడు షెహబాజ్ షరీఫ్ ఇయర్‌ఫోన్ పెట్టుకోవడంలో పడిన తంటాలు అప్పట్లో అందరినీ నవ్వించాయి. ఇప్పుడు, 2025లో చైనాలో జరిగిన SCO సదస్సులో అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.
- By Latha Suma Published Date - 12:14 PM, Wed - 3 September 25

viral video: అంతర్జాతీయ రాజకీయ వేదికలపై దేశ నేతల హావభావాలు, ప్రవర్తనలు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షించడం కొత్త కాదు. అయితే, కొన్ని దృశ్యాలు మాత్రం నవ్వు తెప్పించేలా, సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేలా మారుతుంటాయి. తాజాగా షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చురుకైన నాయకుడిగా కాకుండా, ఓ మీమ్ మేకర్‌గా ట్రెండ్ అవుతున్నారు.
మళ్లీ అదే సీన్, మళ్లీ అదే చికాకు
2022లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన SCO సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైనప్పుడు షెహబాజ్ షరీఫ్ ఇయర్‌ఫోన్ పెట్టుకోవడంలో పడిన తంటాలు అప్పట్లో అందరినీ నవ్వించాయి. ఇప్పుడు, 2025లో చైనాలో జరిగిన SCO సదస్సులో అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. ఈసారి కూడా పుతిన్ తన ఇయర్‌ఫోన్ వేసుకొని సిద్ధంగా ఉండగా, పాక్ ప్రధాని మాత్రం ఇయర్‌ఫోన్‌ను సరిగ్గా ధరించలేక ఇబ్బంది పడ్డారు. ఆయన బాధను గమనించిన పక్కనే ఉన్న అధికారులు మద్దతుగా వచ్చి సాయం చేశారు. అయితే, ఈ క్రమంలో పుతిన్ తన చెవిలో ఉన్న ఇయర్ ఫోన్‌ను తీసి, నవ్వుతూ ‘‘ఇదిగో ఇలా పెట్టుకోవాలి’’ అంటూ షరీఫ్‌కు సలహా ఇచ్చారు. ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అనేక సోషల్‌మీడియా యూజర్లు వీడియోను షేర్ చేస్తూ సరదా వ్యాఖ్యలు పెడుతున్నారు. ఒక యూజర్ బీజింగ్‌లో షెహబాజ్ షరీఫ్ ఇయర్‌ఫోన్ జారిపోయింది. పుతిన్ నవ్వేశాడు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మీమ్ మేటరయిన ప్రధాని
ఇదే సమావేశంలో మరో దృశ్యం కూడా వైరల్‌గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ నడుచుకుంటుండగా, షెహబాజ్ షరీఫ్ మాత్రం చేతులు కట్టుకొని వెనకాల చూస్తూ నిలబడి ఉండటం నెటిజన్లను ఆకర్షించింది. ఆ ఫోటోకు మోడీ-పుతిన్ బ్రోమాన్స్ చూస్తూ షెహబాజ్ షరీఫ్ ఫోమో ఫీలవుతున్నారు అంటూ మీమ్స్ వర్షం కురుస్తోంది.
రాజకీయ పరిపక్వత, పరాయి దేశ నేతల నుంచి సాయం
ఇయర్ ఫోన్ ఘటనలో పుతిన్ చూపిన వినయపూరిత సహాయం మాత్రం పాజిటివ్‌గా మారింది. పుతిన్ వంటి శక్తిమంత నాయకుడు తన ప్రత్యర్థి దేశ ప్రధానికి అవమానం కాకుండా, గౌరవంగా సాయం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇది నేతగా ఉన్న గుణాత్మకతకు నిదర్శనం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
SCO సదస్సులో పాక్‌కు చేదు అనుభవం
ఇక ఈ సదస్సులో పాకిస్తాన్‌కు మరొక అసౌకర్యకరమైన అంశం ఎదురైంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని SCO దేశాలు ఒక్కటిగా ఖండించాయి. ఈ ప్రకటన పాక్‌కు అసహనం కలిగించింది. అంతేకాకుండా, మోడీ-పుతిన్ స్నేహం, భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడటం చూసి షెహబాజ్ షరీఫ్ మౌనంగా మృదువుగా స్పందించారు. భారత్, రష్యా బంధాన్ని గౌరవిస్తున్నాం. మేము కూడా రష్యాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం అని షెహబాజ్ వ్యాఖ్యానించారు. ఇది తన స్థిరమైన అధికార ప్రతిష్టను నిలబెట్టుకునే ప్రయత్నంగా విశ్లేషించబడుతోంది.
విమర్శలు మళ్లీ మొదలయ్యేనా?
2022 ఘటన సమయంలో షెహబాజ్ షరీఫ్‌ను పాక్ లోపలే కాకుండా, విదేశీ నేతలు, మీడియా, సెటైరికల్ షోలు ఎద్దేవా చేశారు. ప్రముఖ అమెరికన్ హాస్యనటుడు జిమ్మీ ఫాలన్ “22 కోట్ల పాక్ ప్రజలకు ఈ వ్యక్తి ప్రధాని కావడం ఆశ్చర్యమే” అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కావడంతో, పాత విమర్శలు మళ్లీ పునరావృతం కావడం ఖాయం. ఈ ఘటనలన్నింటిలోనూ ఒక ముఖ్యమైన పాఠం ఉంది. అంతర్జాతీయ వేదికపై నాయకుల ప్రవర్తన, నవ్యం, వినయాన్ని ప్రపంచం గమనిస్తోంది. షెహబాజ్ షరీఫ్ మాత్రం ఈసారి కూడా ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోయారు.
Video: Russian President Vladimir Putin laughs as Pakistan Prime Minister Shehbaz Sharif struggles with headphones during a bilateral meeting in Beijing, China.
The visuals, which have now gone viral, mimic a similar incident from 2022 involving the Pakistan Prime Minister and… pic.twitter.com/6aiMCAtd8G
— NDTV WORLD (@NDTVWORLD) September 3, 2025