HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Social Media Craze Dangerous Stunt With Six Year Old Daughter

Rajasthan : సోషల్‌ మీడియా మోజు..ఆరేళ్ల కుమార్తెతో డేంజర్ స్టంట్‌

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాల పణంగా పెట్టి రీల్‌ చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బరేథా జలాశయాన్ని సందర్శించిన ఈ దంపతులు తమ చిన్నారి కూతురిని జలాశయ గోడపై ఇనుపకడ్డీలకు ఆనుకొని ఉన్న విద్యుత్‌ పెట్టెపై కూర్చోబెట్టి వీడియో తీశారు.

  • Author : Latha Suma Date : 08-07-2025 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Social media craze..dangerous stunt with six-year-old daughter
Social media craze..dangerous stunt with six-year-old daughter

Rajasthan : ఈ కాలంలో సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావాలన్న మోజు రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత, యువతులతో పాటు కొన్ని కుటుంబాలు కూడా రీల్‌ల పేరిట వెర్రి చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కొన్ని సార్లు ఈ చేష్టలు వారి ప్రాణాల మీదకే తెచ్చుకుంటూ, తాము మాత్రమే కాదు.. చుట్టుపక్కలవారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాల పణంగా పెట్టి రీల్‌ చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బరేథా జలాశయాన్ని సందర్శించిన ఈ దంపతులు తమ చిన్నారి కూతురిని జలాశయ గోడపై ఇనుపకడ్డీలకు ఆనుకొని ఉన్న విద్యుత్‌ పెట్టెపై కూర్చోబెట్టి వీడియో తీశారు.

ये रील का चक्कर है बाबू भईया!
राजस्थान के भरतपुर में माता-पिता रील के चक्कर में बेटी की जान को खतरे में डाला।#Rajasthan #BarethaDam #Bharatpur pic.twitter.com/8jTwTrVfT5

— Surabhi🇮🇳 (@surabhi_tiwari_) July 7, 2025

వీడియో ప్రకారం, చిన్నారి మొదట్లో అక్కడికి వెళ్లడానికే భయపడుతోంది. అయినా ఆ తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తూ విద్యుత్‌ పెట్టెపై కూర్చోబెట్టారు. అక్కడుంచిన తరువాత చిన్నారి చేతులు వదిలేసి ఫోన్‌ వైపు చూడాలని తండ్రి ఆదేశించాడు. చిన్నారి తల్లి కూడా పక్కనే ఉండి వీడియో తీస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్షణానైనా పట్టు తప్పితే చిన్నారి నేరుగా జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉందన్న విషయం వాళ్లకు తెలుసూ లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన కొద్ది సేపట్లోనే వేల సంఖ్యలో వ్యూస్‌, కామెంట్లు వచ్చాయి. అయితే, అందులో మెజారిటీ కామెంట్లు ఆగ్రహంతో నిండిపోయాయి. తల్లిదండ్రులు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే.. పిల్లల భవిష్యత్‌ ఎలా? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, మరో వ్యక్తి పర్యాటక ప్రదేశాల్లో రీల్స్‌ పేరుతో ప్రమాదకర స్టంట్లు చేస్తున్నవారిపై కఠిన చర్యలు అవసరం అంటూ అధికారులను కోరారు.

ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని బరేథా పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన దంపతులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు బరేథా జలాశయం వద్ద ఓ కానిస్టేబుల్‌ను నియమించినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఒక ప్రమాదకర ప్రకంపనగా మారుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. “లైక్స్‌” కోసం “లైఫ్‌”ను త్యాగం చేయడమా..? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మిగలాలి. సోషల్‌ మీడియాలో మన్ననలు పొందడం కంటే.. మన జీవిత విలువను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం అనే సంగతిని సమాజం గుర్తించాలి.

Read Also: Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Baretha Reservoir
  • Dangerous Stunt
  • rajasthan
  • social media
  • Stunt Reels

Related News

CBI Shocked by the NEET Paper Leak Scandal

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Mamata Banerjee declares I am absolutely not backing down

    Bengal Politics: అసలు తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd