Water Bottle Fine : వాటర్ బాటిల్ పై రూ.5 ఎక్కువ వసూలు చేసినందుకు లక్ష ఫైన్!
రైలు ప్రయాణం మధ్యలో దాహమేసి ఓ వాటర్ బాటిల్ కొనేందుకు ప్రయత్నించాడు. అయితే,
- By Maheswara Rao Nadella Published Date - 12:14 PM, Sat - 17 December 22

హర్యానాకు (Haryana) చెందిన శివం భట్ ఇటీవల లక్నో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించాడు. చండీగఢ్ (Chandigarh) నుంచి షాజహాన్ పూర్ (Shah Jahan Pur) కు వెళుతున్నాడు. రైలు ప్రయాణం మధ్యలో దాహమేసి ఓ వాటర్ బాటిల్ (Water Bottle) కొనేందుకు ప్రయత్నించాడు. అయితే, బాటిల్ పై ఎమ్మార్పీ రూ.15 మాత్రమే ఉండగా బాటిల్ ను రూ.20 కి అమ్ముతున్నారని గుర్తించాడు. ఇదేంటని అడిగితే.. కావాలంటే తీసుకో, లేదంటే వదిలెయ్ అన్నట్లు జవాబిచ్చాడా కుర్రాడు. మరో దారిలేక అడిగినంతా ఇచ్చి శివం భట్ వాటర్ బాటిల్ (Water Bottle) తీసుకున్నాడు. అయితే, ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఆపై దానిని రైల్వే ఉన్నతాధికారులకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారి రైల్వే ఉన్నతాధికారులకూ చేరడంతో వారు స్పందించారు. లక్నో ఎక్స్ ప్రెస్ లో నీళ్ల బాటిళ్ల అమ్మకానికి లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ ను అరెస్టు చేశారు. ఎమ్మార్పీకన్నా ఎక్కువ ధరలకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నందుకు రైల్వే కాంట్రాక్టర్ కు రూ.లక్ష జరిమానా విధించిన ఐఆర్ సీటీసీ.
Also Read: Cyberabad Extortion : వరుస కాల్స్ చేసి రూ.18 లక్షలు దోపిడీ