Masjid Fight Video: మసీదులో కర్రలతో చితక్కొట్టుకున్న ఇరువర్గాలు
మసీదులో ఘర్షణ వాతావరణంగా చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తులు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురి బట్టలు కూడా చినిగిపోతున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 03-09-2024 - 4:21 IST
Published By : Hashtagu Telugu Desk
Masjid Fight Video: ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే మసీదులో కొట్టుకోవడం సంచలనంగా మారింది. మసీదులో ఈ తరహా సంఘటన ఇదివరకు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. తాజాగా ఓ మసీదుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఇందులో రెండు గ్రూపులు ఎలా కొట్టుకుంటున్నాయో చూడొచ్చు. పదుల సంఖ్యలో ముస్లింలు ఒకరినొకరు బెల్టులు మరియు కర్రలతో కొట్టుకోవడం కనిపిస్తుంది.
మసీదులో ఘర్షణ వాతావరణంగా చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పక్బాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి సబ్జీ పూర్ గ్రామంలోని పెద్ద మసీదులో భక్తుల మధ్య భీకర పోరు జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో, వ్యక్తులు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురి బట్టలు కూడా చినిగిపోతున్నాయి.
ఈ ఘటన అంతా గత శుక్రవారం జరిగినట్లు సమాచారం. మూడున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియో చూస్తుంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లే అనిపిస్తోంది. అరడజనుకు పైగా భక్తులు మసీదులో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ గొడవ వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Also Read: Sleeping : నిద్ర -గుండె జబ్బుల మధ్య సంబంధం ఏమిటి? తాజా అధ్యయనం కీలక విషయాలు..!