Celebrate Divorce : విడాకులు తీసుకున్న ఆనందంలో పాలతో స్నానం
Celebrate Divorce : విడాకులు అధికారికంగా ఖరారవడంతో మానిక్ అలీ ఆనందోత్సాహంగా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. 40 లీటర్ల పాలను నాలుగు బిందెల్లో తీసుకొని తనపై పోసుకుంటూ
- By Sudheer Published Date - 04:25 PM, Mon - 14 July 25

అస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన మానిక్ అలీ (Manik Ali) అనే వ్యక్తి తన భార్యతో విడాకులు (Divorce ) తీసుకున్న ఆనందాన్ని ఎంతో విచిత్రంగా జరుపుకున్నాడు. ‘నేడు నుంచి నేను స్వతంత్రుడిని’ (freedom)అంటూ మానిక్ అలీ పాలతో స్నానం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విడాకుల ప్రక్రియ పూర్తయిన అనంతరం.. తనకు ‘విముక్తి’ లభించిందంటూ ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేసాడు.
వివరాల్లోకి వెళ్తే.. నల్బారి జిల్లా బొరోలియాపారా ప్రాంత నివాసితుడైన మానిక్ అలీ తన భార్య రెండు సార్లు వివాహేతర సంబంధాలతో ఇంటి నుంచి పారిపోయిందని ఆరోపించాడు. అప్పుడప్పుడు భార్యను తిరిగి తీసుకురావడానికి తన చిన్న కుమార్తె భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఒప్పించాడట. కానీ మళ్లీ మళ్లీ జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో విసిగిపోయిన మానిక్ అలీ చివరకు చట్టపరమైన మార్గాన్ని ఎంచుకుని విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. ఈ కేసులో ఇటీవల కోర్టు విడాకుల మంజూరు నిర్ణయం తీసుకుంది.
Aiden Markram: ఐసీసీ అరుదైన గౌరవాన్ని అందుకున్న సౌతాఫ్రికా ఆటగాడు!
విడాకులు అధికారికంగా ఖరారవడంతో మానిక్ అలీ ఆనందోత్సాహంగా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. 40 లీటర్ల పాలను నాలుగు బిందెల్లో తీసుకొని తనపై పోసుకుంటూ “ఇప్పటి నుంచి నేను ఫ్రీ” అంటూ పదే పదే చెప్పడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వినూత్న ఆచరణను అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది ఎంతో మందిని ఆకర్షించింది. వీడియో చూస్తున్నవారిలో కొందరు దీన్ని వినోదంగా తీసుకోగా, మరికొందరు అతడి బాధను అర్థం చేసుకుని స్పందిస్తున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లలో పెద్ద చర్చే సాగుతోంది. “ఇది సాధారణ విషయమే” అని కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు మాత్రం “ఇతడి పాలస్నానం హాస్యాస్పదంగా అనిపించినా… దాని వెనుకున్న బాధను గమనించాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Pasteurised! Man Bathes in Milk to Celebrate Divorce from “Cheating Wife”
“I am free,” Assam resident Manik Ali announced as he poured buckets of milk over his head – becoming an Indian Internet sensation in the process.
You could say he’s milking the moment after legally… pic.twitter.com/Tq3xxjDnHE
— RT_India (@RT_India_news) July 13, 2025