Viral Video: విదేశీయుడిపై దాడికి ప్రయత్నించిన భారత్ వాసుడు.. వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ?
మాములుగా టూరిజం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదంటే ఇతర కొత్త దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలను ఫోటోలు బంధించడంతోపాటు అందుకు సంబంధించిన దృశ
- By Anshu Published Date - 04:08 PM, Mon - 12 June 23

మాములుగా టూరిజం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదంటే ఇతర కొత్త దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలను ఫోటోలు బంధించడంతోపాటు అందుకు సంబంధించిన దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ట్రెండింగ్ బాగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు.. టూరిజం వీడియోలకి యూట్యూబ్ లో కూడా బాగానే వ్యూస్ వస్తున్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా టూరిజం ప్రదేశాలలో అనుకోని చేయదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఒక విదేశీయుడికి కూడా ఇలాగే చేదు అనుభవం ఎదురయింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తిపై స్థానికంగా ఉండే వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్‌కు చెందిన ట్రావెల్ వ్లాగర్ పెడ్రో మోటా అనే వ్యక్తికి విదేశాల్లో పర్యటిస్తూ అక్కడ స్పెషల్ ప్లేసెస్, అక్కడి అనుభవాలను ఇతరులకు షేర్ చేస్తుంటాడు.
అంతేకాకుండా ప్రఖ్యాత నగరాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటిస్తూ అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల ఆచార వ్యవహారాలను వీడియోలు తీస్తూ స్ట్రీట్ ఫుడ్స్ పై అలాగే ఇతర వాటిపై స్పెషల్ వీడియోలు చేస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆ విదేశీయుడు పెడ్రో మోటా గత కొద్దిరోజులుగా కర్ణాటక లోని బెంగళూరులో ఉంటూ అక్కడున్న ప్రదేశాలను వీడియోలు తీస్తూ తన అనుభవాలను షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వీడియోను చిత్రీకరిస్తున్న సమయంలో అతని పై స్థానికంగా ఉండే ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించాడు.
Karnataka: Bengaluru Police has arrested the accused Nawab Hayath Sharif under Section 92 for assaulting a Dutch vlogger.
Seems like he had objection against the vlogger greeting everyone with ‘Namaste’. pic.twitter.com/8JHKdESZnW
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2023
చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. దీంతో, షాకైన పెట్రో మోటా తనను వదిలేయాలని రిక్వెస్ట్ చేశాడు. నమస్తే అంటూ అతన్ని విడిచి పెట్టమని కోరుతూ బలవంతంగా అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా తన వీడియోలో రికార్డు అయ్యింది. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 92 కింద కేసు పెట్టినట్లు బెంగళూరు వెస్ట్ డివిజన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లక్ష్మణ్ తెలిపారు. నిందితుడి పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.