HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Ceo Shares Sale Proceeds With Employees

సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.

  • Author : Gopi Date : 26-12-2025 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CEO
CEO
  • అమెరికాలోని ఆశ్చ‌ర్య‌పోయే ఘటన
  • 540 మంది ఉద్యోగులకు రూ.2,155 కోట్లు ఇచ్చిన సీఈవో
  • ఉద్యోగుల కోసం లాభాల్లో వాటా

CEO: సాధారణంగా ఏదైనా కంపెనీ భారీ డీల్ కుదుర్చుకున్నప్పుడు ఆ లాభాలు కేవలం ప్రమోటర్లకు లేదా ఇన్వెస్టర్లకు మాత్రమే అందుతాయి. కానీ అమెరికాలోని లూసియానాకు చెందిన ఒక కంపెనీ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. లూసియానాకు చెందిన ఫైబర్‌బాండ్ అనే ఫ్యామిలీ బిజినెస్ సీఈఓ గ్రాహం వాకర్, తన కంపెనీని విక్రయించిన తర్వాత వచ్చిన లాభాల్లో తన ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసి ఆదర్శంగా నిలిచారు.

ఉద్యోగుల కోసం రూ. 2155 కోట్లు

కంపెనీ విక్రయం ద్వారా తనకు అందే మొత్తంలో 15 శాతం వాటాను తన వద్ద పనిచేస్తున్న 540 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు పంచాలని గ్రాహం నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం సుమారు 240 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2,155 కోట్లు (21 బిలియన్ల 55 కోట్లు).

Also Read: న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

డీల్- బోనస్ వివరాలు

ఫైబర్‌బాండ్ కంపెనీని అమెరికన్ దిగ్గజ సంస్థ Eaton కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో గ్రాహం ఒక కీలక షరతు పెట్టారు. కంపెనీ అమ్మకం ద్వారా వచ్చే లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని కోరారు. కంపెనీలో షేర్లు లేని ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తింపజేయడం విశేషం. ఈ బోనస్ చెల్లింపులు జూన్ 2025 నుండి ప్రారంభమయ్యాయి.

ఒక్కో ఉద్యోగికి ఎంత వస్తుంది?

ఈ లెక్కన సగటున ప్రతి ఉద్యోగికి సుమారు 4 లక్షల 43 వేల డాలర్లు (భారతీయ రూపాయిల్లో దాదాపు రూ. 3.7 కోట్లు) అందుతాయి. అయితే ఈ మొత్తం ఒకేసారి ఇవ్వబడదు. వచ్చే 5 ఏళ్ల కాలంలో విడతల వారీగా ఈ నగదును అందజేస్తారు. అయితే, ఈ బోనస్ పొందాలంటే సదరు ఉద్యోగి కంపెనీలోనే కొనసాగాలనే నిబంధన ఉంది.

సీఈఓ ఏమన్నారంటే?

తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు. ఈ వార్త విన్నప్పుడు చాలా మంది ఉద్యోగులు మొదట నమ్మలేకపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్రాహం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది ఈ ఏడాది క్రిస్మస్ సీజన్‌లో అత్యంత సానుకూలమైన వార్తల్లో ఒకటిగా నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • ceo
  • CEO Loyalty To Employees
  • employees
  • Fiberbond

Related News

Richest Indians

షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.

  • Gratuity

    కొత్త లేబర్ కోడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ అంటే ఏమిటి?

  • US-Iran War

    భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్‌!

Latest News

  • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

  • చీర క్యాన్సర్ ఎలా వస్తుంది?

  • లక్నో సూపర్ జెయింట్స్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • డిజిటల్ జనగణన.. 5.72 లక్షలకు పైగా కుటుంబాలు సెల్ఫ్-ఎన్యూమరేషన్!

  • Property Tax : ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరట

Trending News

    • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd