Police Lathi Charge: న్యూయర్ వేడుకుల్లో అతి.. లాఠీచార్జి చేసిన పోలీసులు.. వీడియో..!
కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం చాలా మందికి చేదు అనుభవాన్ని మిగిలిచింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల రద్దీని అకస్మాత్తుగా అదుపు చేయలేక పోవడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించి, లాఠీచార్జి చేసి జనాన్ని తొలగించాల్సి వచ్చింది.
- By Gopichand Published Date - 11:18 AM, Sun - 1 January 23

కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం చాలా మందికి చేదు అనుభవాన్ని మిగిలిచింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల రద్దీని అకస్మాత్తుగా అదుపు చేయలేక పోవడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించి, లాఠీచార్జి చేసి జనాన్ని తొలగించాల్సి వచ్చింది. చాలా మంది యువకులు గుంపులో ఉన్నారు. అయితే లాఠీచార్జి తర్వాత ఎలాంటి గాయం అయినట్లు నివేదిక లేదు.
#WATCH | Karnataka: Bengaluru police lathi-charged to disperse the huge crowd after it went out of control. pic.twitter.com/yRMdyBSHww
— ANI (@ANI) December 31, 2022
నిజానికి బెంగళూరులోని కోరమంగళలో కొన్ని ఈవ్ టీజింగ్ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చి స్ట్రీట్‌లో భారీగా పోలీసులు మోహరించారు. మహిళల భద్రతను నిర్ధారించడానికి పోలీసులు CBD ప్రాంతాలలో నగరం అంతటా 37 మహిళా భద్రతా దీవులను సృష్టించారు. ప్రతి 100 మీటర్లకు వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు.