Heavy Flood Inflow To Budameru Vagu : విజయవాడకు మరో టెన్షన్..
Heavy Flood Inflow To Budameru Vagu : నిన్నటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా మరింత బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
- By Sudheer Published Date - 11:05 AM, Sun - 8 September 24

Heavy Flood Inflow To Budameru Vagu : విజయవాడ (Vijayawada) వాసులను బుడమేరు వాగు (Budameru Vagu) మరోసారి భయపెడుతోంది. భారీ వర్షాలకు పులివాగు, బుడమేరు వాగుల ప్రవాహం పెరుగుతోంది. దీంతో వరద నీరు బెజవాడలోకి రాకుండా బుడమేరు వద్ద నిన్న పూడ్చిన గండ్ల ఎత్తును పెంచుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి పనులను పర్యవేక్షించారు. మరోవైపు విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు.
కోస్తా జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు
గత పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఖమ్మం , మహబూబాబాద్ , ఇటు విజయవాడ తో పాటు పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత వారం శని, ఆది వారాల్లో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం కాగా..అందులో నుండి ఇంకా వరద బాధితులు తేరుకోనేలేదు..తాజాగా నిన్నటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా మరింత బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బుడమేరు వరదలో ఐటీ ఉద్యోగి గల్లంతు
ఇక నిన్న రాత్రి మచిలీపట్నానికి చెందిన IT ఉద్యోగి ఫణికుమార్ (40) బుడమేరు వరదలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అతని కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్ లోఉద్యోగం చేస్తున్న ఆయన చవితి సందర్భంగా సొంతూరు వచ్చారు. నిన్న గన్నవరంలోని బంధువుల ఇంటికెళ్లి తిరిగి మచిలీపట్నం బయలుదేరాడు. బుడమేరు ఉదృతి పెరిగిందని..వెళ్లోద్దని బంధువులు హెచ్చరించినా వినకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఓ చోట నీటిలో మునిగిన అతని కారును పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు.
Read Also : Flood Water Increasing in Munneru River : భయం గుప్పింట్లో ఖమ్మం..