47 Pythons Caught : లగేజీలో 47 కొండచిలువలు.. ఎక్కడివి ?
47 Pythons Caught : బంగారం, డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తూ ఇటీవల ఎంతోమంది స్మగ్లర్లు ఎయిర్ పోర్ట్ లలో అడ్డంగా దొరికిపోయారు..
- By Pasha Published Date - 03:26 PM, Mon - 31 July 23

47 Pythons Caught : బంగారం, డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తూ ఇటీవల ఎంతోమంది స్మగ్లర్లు ఎయిర్ పోర్ట్ లలో అడ్డంగా దొరికిపోయారు..
అయితే ఒక వ్యక్తి కొండ చిలువలను స్మగ్లింగ్ చేస్తూ.. తాజాగా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో మహమ్మద్ మొయినుద్దీన్ అనే ప్రయాణికుడు 47 కొండ చిలువలతో పట్టుబడ్డాడు.
Also read : Odisha: దారుణం.. రెండు కిలోల టమోటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టిన వ్యక్తి?
మహమ్మద్ మొయినుద్దీన్ అనే ప్రయాణికుడు మలేషియా రాజధాని కౌలలంపూర్ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్టులో దిగాడు. అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో.. కస్టమ్స్ అధికారులు లగేజీని తనిఖీ చేశారు. వాటిలో నుంచి కొండచిలువలు ఒక్కటొక్కటిగా బయటపడటం చూసి అధికారులు అవాక్కయ్యారు. వాటిని కౌంట్ చేస్తే.. మొత్తం 47 కొండచిలువలు ఉన్నాయని(47 Pythons Caught) తేలింది. వాటిని వెంటనే కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని.. ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించారు. మొయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read : Tomato: రూ. 21 ఒక్క లక్షలు విలువైన టమోటా లారీ మాయం.. అసలేం జరిగిందంటే?