Eating Half-Burnt Human : మంచింగ్ కోసం శవాన్నే తిన్న మందుబాబులు
మంచింగ్ లేదే అని అటు ఇటు చూసి..ఏకంగా స్మశానం లో సగం కాలిన శవాన్ని (Burnt Human) తిన్నారు.
- Author : Sudheer
Date : 08-08-2023 - 7:54 IST
Published By : Hashtagu Telugu Desk
మద్యం మత్తు మనుషులను ఏమైనా చేయిస్తుందని విన్నాం.. కానీ ఏకంగా శవాన్నే తినేలా చేయిస్తుందని తాజా ఘటన తో అందరు మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా మద్యం తాగుతూ.. మంచింగ్ కోసం నాన్ వెజ్ తింటుంటారు..ఆలా తినేందుకు ఇష్టపడతారు. ఇక్కడ ఓ ఇద్దరు మందుబాబులు మద్యం సేవిస్తూ.. మంచింగ్ లేదే అని అటు ఇటు చూసి..ఏకంగా స్మశానం లో సగం కాలిన శవాన్ని (Burnt Human) తిన్నారు. ఈ ఘటన ఒడిశా (Odisha) లో చోటుచేసుకుంది. మత్తు మనిషిని ఎంతలా దిగజారుస్తుంది అనేందుకు ఈ ఉదాహరణ చాలు.
ఒడిశాకు చెందిన మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ (Sundar Mohan Singh and Narendra Singh) లు ఫుల్ గా మద్యం సేవించారు. అది వారికీ సరిపోలేదు.. వైన్ షాప్ క్లోజ్ (Wine Shop) చేసే టైం కావడం తో ..మరికొంత మద్యం (వైన్) కొనుగోలు చేసి బయట తాగుదామని వెళ్లారు. మార్గం మధ్యంలో ఓ శ్మశానం కనిపించడంతో అందులో మందు తాగితే ఎవరూ ఏమీ అనరని భావించి..సమాధి ఫై కూర్చుని మద్యం తాగడం మొదలుపెట్టారు. మధ్యలో అరే.. మంచింగ్ తీసుకోలేకదా..అని ఇద్దరు అనుకున్నారు..ఇప్పుడెలా అనుకుంటూ స్మశానం (Cremation) లో దూరంగా చల్లారుతున్న చితి మంటలు కనిపించాయి.
ఇంకేముందు.. ఈ రోజే అంత్యక్రియలు చేశారు కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులు ఏమైనా పెట్టి ఉంటారని భావించారు. తెచ్చుకునేందుకు కాలుతున్న చితి వద్దకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో సగం కాలిన యువతి శవం (Burnt Human) మాంసం ముద్దలు కనిపించాయి. ఆ ముద్దలనే మద్యం తాగుతూ తినేశారు.
ఊహించుకోవడానికే ఇది ఎంతో భయంకరంగా.. అసహ్యంగా అనిపిస్తున్నా.. వారు మాత్రం మత్తులో ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఈ విషయం బయటకు రావడం తో అంత ఇలాంటి వారు కూడా ఉంటారా.. కాశీలో అఘోరాలు శవాలను తింటారని అంత అంటుంటారు.. కానీ ఇక్కడ కూడా ఇలాంటి వారు ఉన్నారా అని షాక్ అయ్యారు.
Read Also : Today Horoscope : ఆగస్టు 8 మంగళవారం రాశి ఫలితాలు.. ఆ రాశిలోని పొలిటికల్ లీడర్లకు బ్యాడ్ టైం