ప్రాణం పోతున్నా సెల్ఫీలే ముఖ్యం.. మహిళ వీడియో వైరల్
సెల్ఫీల పిచ్చి పట్టిందంటే చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాదు. సోషల్ మీడియా అడిక్షన్ అంటే అలాంటిది మరి!
- By Hashtag U Published Date - 02:03 PM, Thu - 20 January 22

సెల్ఫీల పిచ్చి పట్టిందంటే చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాదు. సోషల్ మీడియా అడిక్షన్ అంటే అలాంటిది మరి! సెల్ఫీలు తీసుకుంటూ ఎంతోమంది ప్రమాదాలకు గురైన సంఘటనలూ చూశాం. ఆ క్షణాన్ని కెమెరాల్లో కాప్చర్ చేయాలని,దాన్ని పదిమందితో షేర్ చేసుకోవాలనే ఆతృతే ఇందుకు కారణం. అలాంటి సంఘటనే ఒకటి కెనడాలో జరిగింది.
అసలే చలికాలం కావడంతో కెనడాలో నదులన్నీ గడ్డకట్టుకుపోయాయి. కెనడాఓని మానోటిక్ ఏరియాలో అటుగా వెళ్తున్న ఓ మహిళ కారు స్కిడ్ అవడంతో అలాంటి ఓ నదిలో పడిపోయింది. అయితే, తనను తాను కాపాడుకోవాల్సింది పోయి ఆ మహిళ కారు ఎక్కి ప్రమాదం ఎలా జరిగిందో చూపిస్తూ సెల్ఫీలు దిగడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
Car driving on the ice in Manotick. Went thru the ice. Driver was safely rescued by kayak from neighbours. @ctvottawa pic.twitter.com/N51gHw3ryf
— Lynda Douglas Kurylowicz (@MammaMitch) January 16, 2022
చుట్టుపక్కలవాళ్లు ఆమెను కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆమె మాత్రం సెల్ఫీలే ముఖ్యమన్నట్టు ప్రవర్తించింది. ఓ వైపు వాహనం మునిగిపోతున్నా కూడా ఆమెకు ఏమాత్రం పట్టలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్నవాళ్లు వీడియో తీయండంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,
This evening a car went through the ice in the south end of Ottawa. Thankfully no injuries and an amazing job by local residents saving the driver by using a kayak and quick safe thinking. Another reminder that "No Ice Is Safe Ice". Please use extreme caution this winter season! pic.twitter.com/zpWdeyYzps
— MDT Ottawa Police (@MDTOttawaPolice) January 16, 2022
చాలాపేపటి తర్వాత అసలు లోకంలోకి వచ్చిన ఆమెను కయాక్ వేసుకుని అక్కడకు వెళ్లిన స్ధానికులు రక్షించారు. అమెకు ఎలాంటి గాయాలు కాలేదు.ఆమెపై అతివేగంగా కారు నడిపినందుకు కేసుపెట్టారు పోలీసులు.