Kumbh Mela : మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోంది: యోగి
జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
- By Latha Suma Published Date - 02:55 PM, Sat - 22 February 25

Kumbh Mela : ఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్ రాజ్ లో జరుతున్న మహా కుంభమేళాలోని పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేనివారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Sourav Ganguly: మరో ఫ్యాక్టరీని స్టార్ట్ చేసిన సౌరవ్ గంగూలీ.. ఈసారి ఎక్కడంటే?
మహాశివరాత్రి లోపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నామని.. కానీ అంచనాలకు మించి ప్రజలు హాజరయ్యారని అన్నారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న యాత్రికులతో మహా కుంభమేళాలో వ్యాపారం భారీగా పెరుగుతోంది. యాత్రికులు చేసే ఖర్చులు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.3 లక్షల కోట్లు సమకూరుతాయని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు.
కాగా, ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ, ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వరకు వస్తున్నారు. 2030 నాటికి భారత్‌లో ఆధ్యాత్మిక పర్యటకం 10 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయ పర్యటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా 60 శాతం ఉంటుందని తెలిపాయి.
Read Also: SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం