HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >War Is Not A Bollywood Movie A Serious Issue Former Army Chief

Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్‌ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్‌

యుద్ధం అంటే బాలీవుడ్‌ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్‌ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు.

  • Author : Latha Suma Date : 12-05-2025 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
War is not a Bollywood movie.. a serious issue: Former Army Chief
War is not a Bollywood movie.. a serious issue: Former Army Chief

Manoj Naravane : భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై దేశవ్యాప్తంగా చర్చలు సాగుతున్న తరుణంలో, భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరవణే, యుద్ధం అనేది ఆఖరి మార్గంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, దౌత్యమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలని స్పష్టం చేశారు.

Read Also: PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహరావు విగ్రహం

‘‘యుద్ధం అంటే బాలీవుడ్‌ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్‌ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. షెల్లింగ్ జరుగుతుంటే, చిన్నపిల్లలు రాత్రిళ్లు భయంతో సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెడతారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు తమకు ఇష్టమైన వారిని కోల్పోతే ఆ బాధ తరతరాలవారికి కలిసిరాదంటూ’’ నరవణే చెప్పారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఆయన, ‘‘ఇది ఒక మంచి ప్రారంభం. శాంతి దిశగా అడుగు వేయాల్సిన సమయం ఇదే ప్రధాని మోడీ అన్నారు.  ఇది యుద్ధాల శకం కాదు. దౌత్యం, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. యుద్ధం చివరి మార్గంగా మాత్రమే ఉండాలి. అవసరం ఉన్నా సైనికుడిగా నేను యుద్ధానికి సిద్ధమే. కానీ, శాంతియుత పరిష్కారమే నా మొదటి ఎంపిక’’ అని చెప్పారు. కొంతమంది యుద్ధం ఎందుకు జరగడం లేదని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నరవణే స్పందిస్తూ, ‘‘తెలివితక్కువ నిర్ణయాల వల్ల దేశం యుద్ధంలోకి జారకూడదు. సమస్యలను పరిష్కరించేందుకు మేధస్సుతో ముందుకు వెళ్లాలి. బాలీవుడ్‌ మాదిరిగా ఇది రొమాంటిక్‌ గాథ కాదు. ఇది బాధాకరమైన, తీరని నష్టాలను తీసుకొచ్చే అంశం’’ అని హితవు పలికారు.

Read Also: Current charges : క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క వ్యాఖ్యలు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ceasefire Agreement
  • India Pakistan Tensions
  • Manoj Naravane
  • war

Related News

Ahmad Vahidi

అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

అహ్మద్ వాహిదీ 2009 నుండి 2013 వరకు అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.

  • War Week

    War : వార్ కు వారం..ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే !!

  • Iran Israel War Schools Shut In Kashmir

    హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

  • War Effect On India

    యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

  • Us Attack Iran

    US Israel Iran War : ఇరాన్ పై యుద్ధం..భారత్ కు తీవ్ర నష్టం

Latest News

  • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd