Vamanarao murder case : వామనరావు హత్య కేసు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
కేసుకు సంబంధించి వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- By Latha Suma Published Date - 03:33 PM, Fri - 4 April 25

Vamanarao murder case : తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కేసుకు సంబంధించి వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read Also: Untimely Rains : అకాల వర్షాలు.. రైతులకు కన్నీరు
ఈ మేరకు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో రికార్డులు అందజేయాలని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసం విచారణ జరిపింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.