TPCC: ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశముంది.
- By Latha Suma Published Date - 03:38 PM, Wed - 17 July 24

TPCC executive meeting: ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశముంది. ప్రధానంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై హస్తం నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రేపు లక్ష వరకు రైతు రుణమాఫీ కానున్న నేపథ్యంలో..రుణమాఫీ సంబరాలను పార్టీపరంగా ఎలా నిర్వహించాలో.. నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపైనా చర్చించే అవకాశముంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కత్ పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుండి నేతలందరికి సమాచారం పంపారు.
కాగా, ఇటీవల రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Nara Lokesh: పరదాల పాలన నుంచి ప్రజలకు విముక్తి.. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..!