Delhi : ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్.. నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ!
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు తెలిపారు. అంతేగానీ, శాసనసభాపక్ష సమావేశం లేదా సీఎం ఎంపిక అంశంపై గానీ ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
- By Latha Suma Published Date - 09:29 PM, Tue - 11 February 25

Delhi : ఢిల్లీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీఎం రేసులో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్టీ అగ్రనాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ ఢిల్లీకి చెందిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న్డడా ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు తెలిపారు. అంతేగానీ, శాసనసభాపక్ష సమావేశం లేదా సీఎం ఎంపిక అంశంపై గానీ ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
Read Also: Bird Flu: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ తినొద్దని హెచ్చరించిన అధికారులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై భారీ విజయం తర్వాత తమ పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని బీజేపీ నాయకులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయఢంకా మోగించి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్ ఖాతా తెరవలేక చతికిలపడిన విషయం తెలిసిందే.
మరోవైపు 1998లో సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి తొలి బీజేపీ ముఖ్యమంత్రి కావడానికి అనేక మంది పేర్లు పోటీగా వినిపిస్తున్నాయి. వీరిలో పర్వేష్ వర్మ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, పార్టీ సీనియర్ నాయకుడు విజేందర్ గుప్తా, కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ తదితరులు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో తన పార్టీ ఓటమి తర్వాత పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పతి నాయకురాలు అతిషి తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు.
Read Also: Aero India : యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..!