ChatGPT- DeepSeek : చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!
ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు ఎదురుకావొచ్చని పేర్కొంటూ ఈ అల్టిమేటం ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్‌సీక్‌పై ఇలాంటి ఆంక్షలే విధించాయి.
- By Latha Suma Published Date - 01:28 PM, Wed - 5 February 25

ChatGPT- DeepSeek : కేంద్ర ఆర్థికశాఖ తన ఉద్యోగులను చాట్‌జీపీటీ, డీప్‌సీక్ లాంటి ఏఐ టూల్స్‌కు దూరంగా ఉండాలని ఆదేశాలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు ఎదురుకావొచ్చని పేర్కొంటూ ఈ అల్టిమేటం ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్‌సీక్‌పై ఇలాంటి ఆంక్షలే విధించాయి. అవి కూడా ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు వాటిల్లొచ్చనే ఆందోళనతోనే ఈ పరిమితులు పెట్టాయి.
Read Also: Preity Zinta: ఈ సారి ఐపీఎల్ టైటిల్ నాదేనంటున్న ప్రీతీ పాప
కాగా, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలియని సమాచారం కోసం గూగుల్ వెతుకుతాం. ఇప్పుడు ఏఐ చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత గూగుల్‌కు ప్రాధాన్యం తగ్గింది. ప్రతి ఒక్కరూ చాట్‌జీపీటీనే ఆశ్రయిస్తున్నారు. భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో మెజారిటీ ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీతోనే కొత్త విషయాలు తెలుసుకుంటున్నారని ఓ ఆన్‌లైన్ సర్వేలో తేలింది. గూగుల్, ఇతర సెర్చింజన్లలో సుమారు 40 శాతం మంది యూజర్లు సమాధానాలు వెతుక్కుంటున్నట్లు లోకల్ సర్కిల్ అనే సంస్థ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు చెప్పారు.
మరోవైపు కొత్తగా చైనా రూపొందించిన డీప్‌సీక్ ప్లాట్‌ఫామ్ వైపు ఏఐ చాట్‌జీపీటీ యూజర్లలో ఎనిమిది శాతం మళ్లిపోయారు. మొత్తం ఏఐ బేస్డ్ చాట్‌బోట్ల యూజర్లలో ప్రతి పది మందిలో ముగ్గురు డీప్‌సీక్ ప్లాట్‌ఫామ్ వినియోగిస్తున్నారు. మూడోవంతు యూజర్లు సబ్‌స్క్రైబ్డ్ ఏఐ ప్లాట్‌ఫామ్స్ వాడుతున్నారు.
డీప్‌సీక్, చాట్‌జీపీటీ ఒకటే. ఉచిత వర్షన్‌లో రెండింటిలోనూ ప్రశ్నలు అడగొచ్చు, తెలియని విషయాలను తెలుసుకోవచ్చు, పజిల్స్ లేదా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇంకా ఎన్నో పనులు చేసుకోవచ్చు. అయితే చాట్‌జీపీటీ రోజువారీ వాడకంలో పరిమితి ఉంది. డీప్‌సీక్‌నైతే అపరిమితంగా వాడుకోవచ్చు. ప్రీమియం వర్షన్ తీసుకుంటే అధునాతన పనులు చేసుకోవచ్చు దీని ఏపీఐలతో సొంత టూల్స్ కూడా సృష్టించుకోవచ్చు. చాట్‌జీపీటీతో పోలిస్తే దీని ప్రీమియమూ తక్కువే అని చెప్పవచ్చు.