Building Permission : ఇల్లు కట్టుకునేవారికి ‘చంద్రన్న’ గుడ్ న్యూస్
Building Permission : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు అనుమతులు జారీ చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసారు
- By Sudheer Published Date - 01:11 PM, Wed - 5 February 25

ఇల్లు కట్టుకునేవారికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుడ్ న్యూస్ అందించారు. భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ అప్రూవల్ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు అనుమతులు జారీ చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసారు. ఒక్క సీఆర్డీఏ ప్రాంతానికి మాత్రమే మినహాయింపు ఉంటుందని, మిగతా ప్రాంతాల్లో ఈ అధికారాన్ని పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
300 చదరపు మీటర్లకు మించని నిర్మాణాలకు యజమానులు స్వయంగా ప్లాన్ ధ్రువీకరించుకునే అవకాశాన్ని పొందారు. అర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా తమ దరఖాస్తులను సులభంగా సమర్పించుకోవచ్చు. లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్‌ను ధ్రువీకరించి, పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే విధానం అమలు అవుతోంది. ఈ కొత్త విధానంలో నివాస భవనాలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించడం ద్వారా, నిర్దిష్ట లేఅవుట్‌లలోనే నిర్మాణాలు జరగడానికి నియంత్రణ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఉల్లంఘనలు జరిగితే, భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు కూడా ప్రకటించింది.
KTR : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌లలో నిర్మాణాలకు ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ వర్తించదు. ఈ మార్పులతో రియల్ ఎస్టేట్ రంగం మరింత ప్రోత్సాహం పొందుతుందని, ప్రత్యేకించి వైసీపీ హయంలో పీకేసిన రంగాన్ని ప్రభావితం చేయాలని ఉద్దేశ్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంస్కరణలు నిర్మాణ కార్యకలాపాల వేగాన్ని పెంచేందుకు మరియు ప్రభుత్వ పరమైన వ్యవహారాల్లో ఆలస్యం లేకుండా పనులు జరగడానికి ప్రేరణగా పనిచేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా తీసుకున్న ఈ చర్యలు, ఏపీ లో భవన నిర్మాణ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాయి.