Security : సచివాలయంలోని సెక్యూరిటీ మార్పు..ప్రభుత్వం ఉత్తర్వులు
Security : తెలంగాణ సచివాలయం చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సచివాలయం స్టాఫ్ కదలికలు, సోషల్ మీడియాపై అధికారులు నిఘా పెట్టారు.
- By Latha Suma Published Date - 05:28 PM, Wed - 30 October 24

Telangana Secretariat : తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల ఏక్ స్టేట్-ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బెటాలియన్ కానిస్టేబుళ్లు నిరసనలు, ధర్నాల కారణంగా ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కూడా తాజాగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. సీఎం నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న సెక్యూరిటీ మార్చుస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ భద్రత బాధ్యతలను (టీజీఎస్పీ) ప్రత్యేక పోలీస్ విభాగం స్థానం నుంచి టీజీఎస్పీఎఫ్‌కు అప్పగించింది.
అంతేకాక.. తెలంగాణ సచివాలయం చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సచివాలయం స్టాఫ్ కదలికలు, సోషల్ మీడియాపై అధికారులు నిఘా పెట్టారు. ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు షేర్, లైక్ చేయొద్దని సూచించారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందిని ఆదేశించారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల హెచ్చరించారు. కాగా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విదితమే. దీంతో సెక్యూరిటీ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.