AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది 2025 మార్చి 17న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
- By Latha Suma Published Date - 07:52 PM, Wed - 11 December 24
AP SSC Exams: ఏపీలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ బుధవారం నాడు విడుదల చేశారు. వచ్చే ఏడాది 2025 మార్చి 17న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు రోజు విడిచి రోజు ఎగ్జామ్స్ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
AP SSC Exams Timetable 2025..
.మార్చి 17 – ఫస్ట్ లాంగ్వేజ్
.మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్
.మార్చి 21- ఇంగ్లీష్
.మార్చి 24 – గణితం
.మార్చి 26- ఫిజిక్స్
.మార్చి 28 – బయాలజీ
.మార్చి 31 – సోషల్ స్టడీస్
విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకొని మంచి మార్కులు సాధించాలని మంత్రి లోకేష్ సూచించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కులు చాలా కీలకమని మంత్రి లోకేష్ తెలిపారు. నా సోదరులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అని X వేదికగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Fake Protein Supplements : నకిలీ ప్రొటీన్ సప్లిమెంట్లను దేనితో తయారు చేస్తారో తెలుసా..?