HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Rahul Gandhis Visit To Hyderabad No Entry For Media

Congress : హైదరాబాద్‌ పర్యటనకు రాహల్‌ గాంధీ..మీడియాకు నో ఎంట్రీ..!

Congress : జోడో యాత్ర సమయంలో రాహుల్‌తో కాగడాలు చేతపట్టిన ర్యాలీ ఫోటోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. 'బలహీనుడి గళం, సామాజిక న్యాయ రణం, రాహుల్ గాంధీకి స్వాగతం' అంటూ ఫోటో షేర్ చేశారు.

  • Author : Latha Suma Date : 05-11-2024 - 1:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi's visit to Hyderabad..No entry for media..!
Rahul Gandhi's visit to Hyderabad..No entry for media..!

Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ హాజరయ్యే కార్యక్రమానికి మీడియాకు నో ఎంట్రీ అని సమాచారం అందుతోంది. మీడియాకు నో ఎంట్రీ అని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజుసాయంత్రం బోయిన్ పల్లి నుండి నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చికి రాహుల్ గాంధీ వెళతారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమాన్ని గోప్యంగా ఉంచుతున్న గాంధీ భవన్ వర్గాలు.. సీక్రెట్‌ గా రాహుల్‌ గాంధీ వెళ్లేలా ప్లాన్‌ చేస్తోందట.

బావర్చీలో విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ…. 6 గ్యారెంటీలపై చర్చించనున్నారట. అయితే హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలోనే.. ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. అయితే.. హైదరాబాద్‌ కు రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలోనే.. కాంగ్రెస్‌ బడా నేతలందరూ రాహుల్ గాంధీతో కలిసి వెళతారు.

మరోవైపు రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్న ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. జోడో యాత్ర సమయంలో రాహుల్‌తో కాగడాలు చేతపట్టిన ర్యాలీ ఫోటోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. ‘బలహీనుడి గళం, సామాజిక న్యాయ రణం, రాహుల్ గాంధీకి స్వాగతం’ అంటూ ఫోటో షేర్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు మీ బాస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరికొంత మంది రాహుల్ గాంధీ అశోక్‌నగర్ రావాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, సాయంత్రం 4.45 గంటలకు రాహుల్ గాంధీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోని అక్కడి నుంచి పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు భారీ ర్యాలీగా వెళ్తారు. అక్కడ కులగణన విధి విధానాలు, సామాజిక న్యాయం, పలు అంశాలపై మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మీటింగ్ తర్వాత రాత్రి 7:10 గంటలకు రోడ్డు మార్గం గుండా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి రాహుల్ వెళ్తారు.

Read Also: Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 6 Guarantees
  • Bavarchi
  • congress
  • No entry for media
  • rahul gandhi
  • RTC Cross Roads
  • telangana tour

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Delhi Fire Accident: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd