Pure : కర్నూలులో ప్యూర్ కొత్త షోరూం ప్రారంభం
మంత్రి టి జి భరత్ మాట్లాడుతూ.. "కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూమ్ స్వచ్ఛమైన మరియు హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా వుంది " అని అన్నారు.
- By Latha Suma Published Date - 06:29 PM, Fri - 28 March 25

Pure : ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ ఇంధన ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉన్న ప్యూర్నే డు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మరో షోరూమ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ & సర్వీస్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది అత్యుత్తమ ఉత్పత్తులను అందించే బ్రాండ్ యొక్క అధునాతన సాంకేతికతను ప్రత్యక్షముగా వీక్షించటానికి వినియోగదారులకు అద్భుతమైన ప్రాంగణాన్ని అందిస్తుంది.
కొత్త షోరూమ్ పర్యావరణ అనుకూలమైన స్వచ్ఛమైన అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా పరిష్కారాలు , ఇంధన నిల్వ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తూ ప్యూర్ యొక్క పూర్తి ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం , ఆహార ప్రాసెసింగ్ శాఖల గౌరవ మంత్రి టి జి భరత్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాంతం యొక్క సస్టైనబిలిటీ లక్ష్యాలకు దోహదపడుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ , ఇంధన నిల్వ ఉత్పత్తులలో కంపెనీ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
Read Also: Ugadi 2025 : ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు..?
“కర్నూలులోని ఈ కొత్త షోరూమ్ పర్యావరణ అనుకూల రవాణా, నమ్మకమైన గృహ ఇంధన ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ పౌరులను శక్తివంతం చేయాలనే అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది” అని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు – సీఈఓ శ్రీ రోహిత్ వదేరా అన్నారు. ఆయనే మాట్లాడుతూ “దేశం యొక్క ఇంధన పరివర్తనను వేగవంతం చేసే గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు గ్రిడ్‌లకు ఉపయోగపడే ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను ప్యూర్ ఇటీవల ఆవిష్కరించింది” అని అన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖల గౌరవ మంత్రి టి జి భరత్ మాట్లాడుతూ.. “కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూమ్ స్వచ్ఛమైన మరియు హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా వుంది ” అని అన్నారు.
ప్యూర్ నేడు భారతదేశంలోని టాప్ 10 ఈవీ 2 వీలర్ తయారీదారులలో ఒకటి. కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలను ఆకట్టుకునే రీతిలో 1 లక్ష+ టన్నుల మేర తగ్గించడంలో సహాయపడిన అత్యాధునిక బ్యాటరీ సాంకేతికత ద్వారా కంపెనీ పురోగతి సాధిస్తోంది. స్థిరత్వం పట్ల తన నిరంతర నిబద్ధతలో భాగంగా, ప్యూర్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ మొబిలిటీ , ఎనర్జీ స్టోరేజ్‌లో ఉత్పత్తులను అందిస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉత్పత్తి శ్రేణిలో ePluto 7G MAX, ePluto 7G, ecoDryft 350, ETRANCE Neo+ మరియు eTryst X ఉన్నాయి. హోమ్, కమర్షియల్ , గ్రిడ్ స్కేల్ ఉత్పత్తులను ప్యూర్ పవర్ అందిస్తుంది. కంపెనీ ఇటీవల ప్రతిష్టాత్మకమైన వృద్ధి రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది, రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ప్యూర్ ఈవీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 320కి పైగా అవుట్‌లెట్‌లకు పెంచుతుంది. దీర్ఘ-శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటర్‌సైకిళ్లు , పెద్ద బి 2బి కాంట్రాక్టులకు పెరుగుతున్న డిమాండ్ దీనికి తోడ్పడనుంది.