PM Modi : ఈడీ సీజ్ చేసిన సోమ్ముపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- By Latha Suma Published Date - 02:45 PM, Fri - 17 May 24

PM Modi: దేశంలో ఈడీ, సీబీఐ సంస్థలు సీజ్ చేసిన సొమ్ముపై ప్రధాని మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీజ్ చేసిన డబ్బులు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నామన్నారు. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్నారని.. వారి సొమ్మునంతా ఇప్పుడు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు సీజ్ చేస్తున్నాయన్నారు. అయితే, ఇలా సీజ్ చేసిన డబ్బును పేద ప్రజలకు చేర్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందుకు న్యాయ సలహా కోరామని ప్రధాని మోడీ తెలిపారు. ఆ సలహాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎన్డీయే సర్కారు దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలపై స్పందిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిరుపయోగంగా మారిన ఈడీకి తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు. దీంతో ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు.
Read Also: Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. పూరీ వాళ్లను ఎందుకు సైడ్ చేశాడు..?
అంతే కాక..ఎన్నికల వేళ ఈ సంస్థల ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు సీజ్ చేశాయి. చేస్తూనే ఉన్నాయి. అయితే.. సీబీఐ, ఈడీ సంస్థలు కేవలం విపక్షాలనే టార్గెట్ చేస్తున్నాయని.. కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆయా పార్టీల నేతలు నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని మోడీ.. విపక్ష నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.