Viral Video : బతుకమ్మ ఆడిన కె.ఏ. పాల్..!!
ప్రధానపార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాయి.
- Author : hashtagu
Date : 28-09-2022 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధానపార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం నాడు మునుగోడులో పర్యటించారు. తన కోడలు జ్యోతి బెగల్ తో కలిసి చౌటుప్పల్ వచ్చిన కేఏపాల్..స్థానిక మహిళలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బతుకమ్మ ఆడుతున్న కేఏపాల్ అంటూ కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చౌటుప్పల్ లో తన మునుగోడు పర్యటన లో భాగంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు DR KA పాల్ మరియు జ్యోతి బెగల్ . pic.twitter.com/xKlDRSewHJ
— Dr KA Paul (@KAPaulOfficial) September 25, 2022