HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Pm Modi Visit To Russia Cancelled

Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!

భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది.

  • Author : Latha Suma Date : 30-04-2025 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi visit to Russia cancelled!
PM Modi visit to Russia cancelled!

Russia Tour :  భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోడీ బదులు భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్‌ వర్గాలు ఈరోజు ప్రకటించాయి. భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది. మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో మే 9న భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు. 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది మిత్ర దేశాధినేతలను పుతిన్‌ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీకి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also: Nandamuri Balakrishna : ‘జైలర్2’లో నందమూరి బాలకృష్ణ.. చిరంజీవి కూడా నటిస్తారా ?

కాగా, ప్రధాని మోడీ భారత్‌లో పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశంతో నెలకొన్న వాణిజ్య, దౌత్య పరమైన అత్యంత కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్యా పర్యటన చేయటం భావ్యం కాదని భావించిన మోడీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు.

ఇక, ప్రధాని మోడీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అని నిన్న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో స్వేచ్ఛ ఇచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వదిలేది లేదని ఇప్పటికే మోడీప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంపై. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఏ క్షణమైన దాడి చేసే అవకాశాలు లేకపోలేదు. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీనిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నామని అన్నారు. అలాగే ఈ రోజు వరుస భేటీలకు అధ్యక్షత వహించడం చూస్తుంటే.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

Read Also: Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Moscow trip
  • pm modi
  • Russia Tour
  • Russia tour cancelled
  • victory day celebrations

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd