Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.
- By Latha Suma Published Date - 02:54 PM, Wed - 30 April 25

Telangana SSC Results : తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాలలో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లో చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. ఈ సారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇస్తున్నారు. కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదుచేస్తారు.
Read Also: AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై మరో కేసు
ఈసారి టెన్త్ ఫలితాలలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు. ఏడాది టెన్త్ క్లాస్ ఫలితాలలో జిపిఏ విధానాన్ని తొలగించి, సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాస్ అని, కాని విద్యార్థులకు ఫెయిల్ అని టెన్త్ క్లాస్ మార్కులు మేము పై ఇవ్వనున్నారు. హిందీ సబ్జెక్టులో రాత పరీక్షలో 16 కాగా, సబ్జెక్ట్ పాస్ మార్కులు 20.. మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో రాత పరీక్షలో 28 మార్కులు, ఓవరాల్‌గా సబ్జెక్టు పాస్ మార్కులు 35 అని తెలిపారు. మొత్తం ఆరు సబ్జెక్టులు కాదా ఒక సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులు ఉంటాయి. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ కు 20 మార్కులు చొప్పున కేటాయించారు.
ఇక, పదో తరగతి పరీక్షల ఫలితాలల్లో మహబూబాబాద్ జిల్లా 99.29 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్, జడ్పీ, గవర్నమెంట్ స్కూల్స్ రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం 92.78 కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. కాగా, ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఫీజులు చెల్లించేందుకు చివరి తేదీ మే 16.
Read Also: IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్‌ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్