Nandamuri Balakrishna : ‘జైలర్2’లో నందమూరి బాలకృష్ణ.. చిరంజీవి కూడా నటిస్తారా ?
‘జైలర్2’లో(Nandamuri Balakrishna) చిరంజీవి నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
- By Pasha Published Date - 03:35 PM, Wed - 30 April 25

Nandamuri Balakrishna : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్2’ మూవీ ఈ ఏడాది నవంబరులో రిలీజయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇది కచ్చితంగా తెలుగు సినీ ప్రియులకు ఆసక్తిని రేకెత్తించే విషయమే. ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించబోతున్నారట. ఈమేరకు ‘జైలర్2’ మూవీ టీమ్ ప్రతినిధులు చేసిన ఒక ప్రతిపాదనకు సానుకూలంగా బాలయ్య బాబు స్పందించారట. అయితే ఈ అంశంపై ‘జైలర్2’ మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read :Hafiz Saeed : పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్.. హఫీజ్ సయీద్ ఇంటి సీక్రెట్స్
నెల్సన్ దిలీప్ కుమార్ కీలక నిర్ణయం..
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్2’ అనేది మల్టీస్టారర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఎంతోమంది అతిరథ మహారథులైన నటులు నటిస్తున్నారు. ఈ మూవీ పార్ట్ 1 (జైలర్ 1)లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి వారు నటించారు. మూవీ స్టోరీని మలుపుతిప్పే అతిథి పాత్రల్లో వాళ్లు మెరిశారు. జైలర్ 2లో కూడా అలాంటి పాత్రనే బాలకృష్ణ పోషిస్తారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ‘జైలర్ 1’లోనూ బాలకృష్ణను తీసుకుందామని నెల్సన్ దిలీప్ కుమార్ అనుకున్నారట. అయితే బాలకృష్ణ ఇమేజ్‌కు తగిన పాత్ర లేకపోవడంతో వెనక్కి తగ్గారట. ఈసారి జైలర్2లో బాలయ్య బాబుకు సరిపోలే పాత్ర ఉండటంతో.. ఆయనతో నెల్సన్ చర్చలు జరిపి ఓకే చేయించుకున్నారట.
Also Read :NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్ జోషి.. ఎవరు ?
విలన్‌గా సూర్య.. పాజిటివ్ రోల్‌లో బాలయ్య
ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య ఇద్దరు కూడా నటిస్తారనే టాక్ కొన్ని రోజుల క్రితం వరకు వినిపించింది. అయితే దానిపై క్లారిటీ మాత్రం రాలేదు. బాలయ్య నటిస్తారని ఇప్పుడు తెలియవచ్చింది. ‘జైలర్2’లో(Nandamuri Balakrishna) చిరంజీవి నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య కూడా జైలర్ 2లో ఒక కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలయ్యది పాజిటివ్ రోల్ అని, సూర్యది నెగెటివ్ రోల్ అని అంటున్నారు. జైలర్ 2 స్టోరీలో బాలయ్య, సూర్య మధ్య భీకర ఘర్షణ జరుగుతుందట. దీన్ని స్క్రీన్‌పై చూస్తే ఫ్యాన్స్‌కి మాంచి కిక్ రావడం ఖాయం. ఈ అంచనాలన్నీ నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే.