Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది.
- By Latha Suma Published Date - 03:57 PM, Wed - 30 April 25

Russia Tour : భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోడీ బదులు భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఈరోజు ప్రకటించాయి. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో మే 9న భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు. 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది మిత్ర దేశాధినేతలను పుతిన్ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీకి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Nandamuri Balakrishna : ‘జైలర్2’లో నందమూరి బాలకృష్ణ.. చిరంజీవి కూడా నటిస్తారా ?
కాగా, ప్రధాని మోడీ భారత్‌లో పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశంతో నెలకొన్న వాణిజ్య, దౌత్య పరమైన అత్యంత కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్యా పర్యటన చేయటం భావ్యం కాదని భావించిన మోడీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు.
ఇక, ప్రధాని మోడీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అని నిన్న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో స్వేచ్ఛ ఇచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వదిలేది లేదని ఇప్పటికే మోడీప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంపై. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఏ క్షణమైన దాడి చేసే అవకాశాలు లేకపోలేదు. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీనిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నామని అన్నారు. అలాగే ఈ రోజు వరుస భేటీలకు అధ్యక్షత వహించడం చూస్తుంటే.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
Read Also: Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి