HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Pakistan Takes Retaliatory Action Bans Indian Ships

Pakistan : ప్రతీకార చర్యలకు దిగిన పాక్.. భారత నౌకలపై నిషేధం

పాక్‌ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. "న్యూఢిల్లీతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది తాత్కాలికం కాదు. భారత్‌ తమ వైఖరిని మారించేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

  • Author : Latha Suma Date : 04-05-2025 - 3:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan take retaliatory action, bans Indian ship
Pakistan take retaliatory action, bans Indian ship

Pakistan:  ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకుగాను పాకిస్థాన్‌ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులు చేపట్టడాన్ని భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ తాజాగా ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన్న వాణిజ్య నౌకలు తమ దేశపు ఓడరేవులను ఇకపై ఉపయోగించుకోలేవని పాక్‌ స్పష్టం చేసింది.

Read Also: Road accident : మానవత్వం చాటుకున్న హరీశ్ రావు..జనాల ప్రశంసలు

పాక్‌ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. “న్యూఢిల్లీతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది తాత్కాలికం కాదు. భారత్‌ తమ వైఖరిని మారించేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాదు, భారత్‌ నుంచి దిగుమతి అయ్యే పలు ప్రధాన వస్తువులపై కూడా పాక్‌ బ్యాన్‌ విధించినట్లు వెల్లడించింది.

పాక్‌ తీసుకున్న ఈ చర్యలతో వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా అనేక పరిమితులు ఉన్నాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్‌ (MFN) హోదాను తొలగించింది. ఆ వెంటనే పాక్‌ నుంచి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచింది. తాజాగా భారత్‌ పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్‌ నుంచి అన్ని రకాల దిగుమతులను నిలిపివేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పాక్‌ ఆంక్షలు విధించడం గమనార్హం. పాక్‌ నౌకలు కూడా ఇకపై భారత రేవుల్లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు దేశాల మధ్య మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్, సముద్ర మార్గాల్లో వాణిజ్యం ఇకపై నిలిచిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక, పై భారత్‌ తరఫున అంతర్జాతీయ వేదికలపై పాక్‌ వ్యతిరేకంగా మరింత దూకుడుగా వ్యూహాలు రచించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న భారత్‌ సంకల్పం ఈ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.

Read Also: Indian Army: లోయలో పడిన మరో ఆర్మీ వాహనం.. మృత్యులోయల డేంజర్ బెల్స్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian ships Ban
  • pakistan
  • takes retaliatory action
  • terrorism

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd