Trending
-
Drones : శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.
Date : 10-05-2025 - 5:10 IST -
Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్‌లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
Date : 10-05-2025 - 5:01 IST -
Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం
దేశ సేవలో తానూ ఓ చిన్న పాత్ర పోషించాలని భావించిన అయ్యన్నపాత్రుడు, తన నెల వేతనమైన రూ. 2,17,000ను జాతీయ రక్షణ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక అయిన 'ఎక్స్' లో పేర్కొన్నారు.
Date : 10-05-2025 - 4:39 IST -
Omar Abdullah : పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: జమ్మూకశ్మీర్ సీఎం
ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Date : 10-05-2025 - 4:32 IST -
India Pakistan War: భారత్‌తో యుద్ధం.. భయపడిన పాక్ రిటైర్డ్ సైనిక అధికారి!
గురువారం రాత్రి పాకిస్తాన్ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 టర్కీ డ్రోన్‌లను ప్రయోగించింది.
Date : 10-05-2025 - 4:16 IST -
Mahendra Singh Dhoni: టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏమిటి? పాక్‌తో ధోనీ కూడా యుద్ధం చేస్తాడా?
టెరిటోరియల్ ఆర్మీ ఒక రిజర్వ్ సైనిక దళంలా ఉంటుంది. దీనికి సైన్యం నుంచి శిక్షణ కూడా అందించబడుతుంది. దేశానికి యుద్ధ సమయం సమీపించినప్పుడు ఈ ఆర్మీని పిలుస్తారు.
Date : 10-05-2025 - 3:52 IST -
Virat Kohli: ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్?
2011లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కోహ్లీ గత దశాబ్దంలో భారత రెడ్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈ సమయంలో అతను దూకుడైన కెప్టెన్సీ, అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఇంటా, విదేశాల్లోనూ ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు.
Date : 10-05-2025 - 3:07 IST -
Pak Nuclear Bombs: అణుబాంబుల విభాగంతో పాక్ ప్రధాని భేటీ.. ఎందుకు ?
ఈ దాడికి యత్నించినందుకు ప్రతీకారంగా వెంటనే భారత సైన్యం(Pak Nuclear Bombs) పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్, చక్వాల్‌లో ఉన్న మురిద్, షోర్కోట్‌లో ఉన్న రఫిఖీ సహా మొత్తం నాలుగు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
Date : 10-05-2025 - 3:02 IST -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. హతమైన ఉగ్రవాదుల వివరాలు వెల్లడి..!
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ – లష్కరే తయ్యిబా కీలక కమాండర్. ఇతని అంత్యక్రియలు పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించిందని సమాచారం. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Date : 10-05-2025 - 3:01 IST -
Border Tensions : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
Date : 10-05-2025 - 2:36 IST -
Monsoon : మే 27న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు: ఐఎండీ
సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నాటికి వర్షాకాలం పూర్తిగా ముగుస్తుంది.
Date : 10-05-2025 - 2:09 IST -
TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !
కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.
Date : 10-05-2025 - 1:56 IST -
PM Modi : త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని హైలెవల్ మీటింగ్
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరుగుతున్న ఈ అత్యవసర భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Date : 10-05-2025 - 1:55 IST -
Drone Attack : ఢిల్లీ విమానాశ్రయంలో 138 విమానాల రద్దు
భారత ప్రతీకార చర్యలకు పాకిస్థాన్ తీవ్రంగా స్పందిస్తోంది. గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 టర్కీ తయారీ డ్రోన్లతో భారత్ సరిహద్దు ప్రాంతాలపై దాడికి పాల్పడింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పలు మిసైల్‌లు, డ్రోన్ల దాడులు జరిపినట్లు నివేదికలు వెల్లడించాయి.
Date : 10-05-2025 - 1:35 IST -
India-Pakistan tensions : ఛార్ధామ్ యాత్ర నిలిపివేత
ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత దేశంలో హిందూ పుణ్యక్షేత్రాలపై డ్రోన్ దాడులకు యత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా పరిస్థితులపై కేంద్రం సీరియస్ అయింది.
Date : 10-05-2025 - 1:14 IST -
Srinagar Explosions: శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై పాక్ దాడి.. దాల్ లేక్‌లో మిస్సైల్ పేలుడు
ఈనేపథ్యంలో శ్రీనగర్‌లో(Srinagar Explosions) సైరన్లు మోగిస్తున్నారు.
Date : 10-05-2025 - 12:55 IST -
Pakistan Attack: 26 ప్రదేశాల్లోకి పాక్ డ్రోన్లు.. నాలుగు ఎయిర్‌బేస్‌లపై దాడి
మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ(Pakistan Attack) మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ శ్రీనగర్, అవంతిపొరా, ఉధంపూర్ పరిధిలోని స్కూళ్లు, ఆస్పత్రులపైనా దాడి చేసింది.
Date : 10-05-2025 - 12:09 IST -
Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’ మూవీ.. పోస్టర్ వచ్చేసింది
ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor Movie) సినిమా రాబోతోంది.
Date : 10-05-2025 - 8:51 IST -
India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్ ఎటాక్.. బార్డర్‌లోని డ్రోన్ల లాంచ్ ప్యాడ్ ధ్వంసం
ఈరోజు (శనివారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం(India Attack) పెట్టే ప్రెస్‌మీట్‌లో వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Date : 10-05-2025 - 8:20 IST -
Nuclear Bomb: లాహోర్‌లో అణు బాంబు పేలితే ఏమవుతుంది? ఎంతమంది చనిపోతారు?
రిసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ముంబైపై 15 కిలోటన్ అణు బాంబు విస్ఫోటం జరిగితే 1.6 లక్షల నుండి 8.6 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. ఈ లెక్కన పోల్చితే లాహోర్‌లో కూడా ఇంతే సంఖ్యలో మరణాలు సంభవించవచ్చు.
Date : 09-05-2025 - 10:10 IST