HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Law And Order Has Deteriorated In Ap Presidents Rule Should Be Imposed Immediately Jagan

YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్‌

రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్‌ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.

  • Author : Latha Suma Date : 04-07-2025 - 7:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Law and order has deteriorated in AP..President's rule should be imposed immediately: Jagan
Law and order has deteriorated in AP..President's rule should be imposed immediately: Jagan

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నేటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్‌ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు. రెడ్‌బుక్ లాంటి విధానాలతో, రాజకీయ పగలతో ముదిరిన దుర్మార్గపు చర్యలతో రాష్ట్రం రక్తమోడుతోంది. శాంతిని భంగం చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తుండటం విచారకరం.

Read Also: Ukraine- Russia: ఉక్రెయిన్‌పై ర‌ష్యా భారీ దాడి.. ఏకంగా 550 దాడులు!

అది సాధ్యం కాకపోతే, ప్రత్యక్ష దాడులకు పాల్పడేందుకు టీడీపీకి చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావుపై దాడి ఉదాహరణగా చూపుతూ జగన్ పట్టపగలు ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం, ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా పాలన సాగుతుందో స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా పాలనకు నిదర్శనం అని తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం వైసీపీలో చురుకుగా పాల్గొంటూ, ప్రజల్లో గౌరవాన్ని సంపాదించిందని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా తన అనుచరులను పురిగొల్పి ఈ దాడులకు తెగబడ్డారు.

ఇది ఒక తాలూకు రాజకీయ కుట్ర. గందరగోళం సృష్టించి ప్రజల మద్దతు కోల్పోతున్న టీడీపీ, ఇప్పుడు భయపడతూ అరాచకాలకు పాల్పడుతోంది అని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ దాడులను ప్రోత్సహిస్తూ, గ్యాంగ్‌లీడర్‌లా వ్యవహరిస్తున్నారు. వరుస దాడులు, వేధింపుల నేపథ్యంలో, ఈ రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు. మాఫియా తరహాలో పాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేందుకు అర్హత లేదు. చట్టాన్ని అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నప్పుడు, రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదని నేను ప్రశ్నిస్తున్నాను అని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్రం నిద్రలేచి స్పందించాలనీ, రాష్ట్రంలోని ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

Read Also: Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • law and order
  • Peace and Security
  • President Rule
  • Redbook
  • tdp
  • ys jagan

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd