Trending
-
Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు లోగాన్ మెగాఫోన్ పట్టుకోనున్నారు. ‘డ్రీమ్ నైట్ స్టోరీస్’ (DKS) బ్యానర్‌పై శ్రవణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాణ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Published Date - 03:14 PM, Sat - 5 July 25 -
Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు
ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్ ఠాక్రే (ఎంఎన్ఎస్) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో రాజ్ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించిన సంగతి తెలిసిందే.
Published Date - 02:36 PM, Sat - 5 July 25 -
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
Published Date - 01:58 PM, Sat - 5 July 25 -
Jharkhand : ఝార్ఖండ్ బొగ్గుగనిలో ప్రమాదం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు
ఈ ఘటనపై ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, శనివారం ఉదయం 3:00 గంటల ప్రాంతంలో స్థానికులు గనిలో అక్రమంగా ప్రవేశించి బొగ్గు తవ్వకాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో గనిలోని పైభాగం ఒక్కసారిగా కూలిపోవడంతో, అక్కడ ఉన్నవారిలో ఒక్కరిని మృతిగా గుర్తించారు.
Published Date - 01:40 PM, Sat - 5 July 25 -
CM Revanth Reddy : చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Published Date - 01:22 PM, Sat - 5 July 25 -
Dalai Lama : ఇంకో 30-40 ఏళ్లు జీవించాలని నా ఆకాంక్ష : దలైలామా
అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో దలైలామా దీర్ఘాయుష్షి కోసం పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తుండగా, ఆయన మరో 30–40 సంవత్సరాలు ప్రజల సేవలో ఉండాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. దలైలామా మాట్లాడుతూ..నేను మరికొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలనన్న సంకేతాలను దేవుడు నాకు ఇస్తున్నాడు.
Published Date - 01:01 PM, Sat - 5 July 25 -
Kamal Haasan : కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
అంతేకాకుండా, ఆయనపై సమన్లు జారీ చేస్తూ, ఆగస్టు 30న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు గత నెలలో వెలువడ్డాయి. కమల్ హాసన్ తన కొత్త సినిమా 'థగ్ లైఫ్' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో మాట్లాడుతూ..కన్నడ భాష తమిళ భాష నుంచే ఉద్భవించింది అని చెప్పారు.
Published Date - 12:48 PM, Sat - 5 July 25 -
KCR : కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, శనివారం ఉదయం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం కేసీఆర్‌కు జ్వరంతో పాటు శరీరంలో బలహీనతలు కనిపించాయి.
Published Date - 12:24 PM, Sat - 5 July 25 -
Ranya Rao : నటి రన్యారావు ఆస్తుల జప్తు.. స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో చర్యలు
ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రన్యా రావుకు చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేశారు. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్లో ఉన్న ఓ లగ్జరీ ఇల్లు, అర్కవతి లేఅవుట్లోని ఖరీదైన ప్లాట్, తుమకూరు జిల్లాలోని పారిశ్రామిక స్థలం, అలాగే అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అన్ని ఆస్తుల మిలకెట్టు విలువ సుమారు రూ.34.12 కోట
Published Date - 12:13 PM, Sat - 5 July 25 -
Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే డబ్బుకు లోటు ఉండదు!
చిన్న వెదురు మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు మాత్రమే కాకుండా ఫెంగ్‌షూయ్ కూడా ఈ మొక్కను చాలా శుభప్రదంగా భావిస్తుంది.
Published Date - 11:50 AM, Sat - 5 July 25 -
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు.
Published Date - 11:48 AM, Sat - 5 July 25 -
PM Modi : అర్జెంటీనా పర్యటనకు ప్రధాని మోడీ..57 ఏళ్ల తర్వాత చారిత్రక పర్యటన
ఈ సందర్బంగా హోటల్ పరిసర ప్రాంతాలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాస భారతీయులు మోడీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు.
Published Date - 11:21 AM, Sat - 5 July 25 -
BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్
పార్టీ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బాధ్యతలు స్వీకరించే ముందు, రామచందర్ రావు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉస్మానియా యూనివర్శిటీలోని సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున
Published Date - 10:52 AM, Sat - 5 July 25 -
DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?
కొత్త దలైలామా లేదా ఆయన పునర్జన్మ గుర్తింపు కోసం మొదట కొంతమంది సంభావ్య పిల్లలను గుర్తిస్తారు. ఈ పిల్లల గుర్తింపు మునుపటి దలైలామాకు చెందిన వస్తువులను గుర్తించడం, ప్రార్థన మాల వంటి సంకేతాల ద్వారా గెలుగ్ సంప్రదాయంలోని సీనియర్ లామాలు చేస్తారు
Published Date - 09:46 AM, Sat - 5 July 25 -
Ambati Rambabu : ఏపీలో మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన: అంబటి రాంబాబు
మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేస్తూ, ఈ దాడికి పొన్నూరు ఎమ్మెల్యేకు సంబంధం లేదంటారా? అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. నిందితులను ఎమ్మెల్యే స్వయంగా రక్షించి గ్రామం నుంచి పంపించారు.
Published Date - 07:32 PM, Fri - 4 July 25 -
YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.
Published Date - 07:09 PM, Fri - 4 July 25 -
Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా
ఈ సందర్బంగా పీష్వా బాజీరావ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..పీష్వా బాజీరావు స్మారకానికి NDA కంటే మంచి స్థలం ఉండదన్నది స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఇదే మన భవిష్య సైనిక నాయకత్వానికి పునాది వేసే ప్రదేశం. భారత స్వాతంత్ర్య పోరాటం అంటే మనకు శివాజీ మహారాజ్ గుర్తు వస్తారు.
Published Date - 06:48 PM, Fri - 4 July 25 -
School: 15 సంవత్సరాలుగా గుడిసెలోనే పాఠశాల.. పట్టించుకునే నాథుడే లేడు!
నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన జన ఉద్యమం సల్వా జుడూమ్ సమయం నుండి ఇక్కడ స్కూల్ గుడిసెలో నడుస్తోంది. సంవత్సరాలుగా గ్రామస్థులు శాశ్వత భవనం కోసం డిమాండ్ చేస్తున్నారు.
Published Date - 05:21 PM, Fri - 4 July 25 -
Vijay Thalapathy : విజయ్ను సీఎం అభ్యర్థిగాప్రకటించిన తమిళగ వెట్రి కళగం పార్టీ
తాజాగా, ఆయన పార్టీ కీలక ప్రకటన చేస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్ను అధికారికంగా ప్రకటించింది. పార్టీ స్థాపక అధ్యక్షుడిగా ఉన్న విజయ్ను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ కార్యనిర్వాహక మండలి తెలిపింది.
Published Date - 04:47 PM, Fri - 4 July 25 -
Bomb Threat : వడోదరలోని పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు
ఈ ఉదయం స్కూల్ యాజమాన్యం తమ అధికార ఈమెయిల్‌కు వచ్చిన అనుమానాస్పద మెయిల్‌ను పరిశీలించగా, అందులో స్కూల్ ప్రాంగణంలో బాంబు పెట్టామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి. వెంటనే వారు అప్రమత్తమై వడోదర పోలీసులకు సమాచారం అందించారు.
Published Date - 03:22 PM, Fri - 4 July 25