HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Price Prediction Gold Rate Forecast For 2026 Is Out

బంగారం ధరల రికార్డుల పరంపర.. 2026లో మరింత పెరిగే అవకాశం!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.

  • Author : Gopichand Date : 28-12-2025 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price Prediction
Gold Price Prediction

Gold Price Prediction: సంవత్సరం ముగింపుకు వస్తోంది. కానీ బంగారు ధరలు మాత్రం తగ్గడం లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1.40 లక్షల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరం బంగారం ధరల పరంగా చారిత్రాత్మకమైనదిగా నిలిచిపోనుంది. బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే బంగారం ధరల్లో 70 శాతం కంటే ఎక్కువ పెరుగుదల కనిపించింది. ఏడాది ఆరంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 83,680గా ఉండగా ఇప్పుడు అది క్రమంగా లక్షన్నర రూపాయల దిశగా దూసుకుపోతోంది.

వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయా?

2026లో కూడా ఇదే విధమైన పెరుగుదల కొనసాగుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జేపి మోర్గాన్ (JP Morgan) విశ్లేషకుల ప్రకారం.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 3,000 డాలర్ల నుండి 5,000 డాలర్ల (ప్రతి 10 గ్రాములకు సుమారు రూ. 1,58,485) వరకు వెళ్లే అవకాశం ఉంది. గోల్డ్‌మ్యాన్ సాక్స్ (Goldman Sachs) సర్వే ప్రకారం.. వచ్చే ఏడాది బంగారం ధరలు దాదాపు 36 శాతం పెరిగి 5,000 డాలర్ల మార్కును తాకవచ్చు. ప్రస్తుత ఎక్స్ఛేంజ్ రేటు ప్రకారం ఇది 10 గ్రాములకు సుమారు రూ. 1,58,213 అవుతుంది. ఈ అంచనాల్లో భారతదేశంలో విధించే 3 శాతం GST, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు కలపలేదు.

Also Read: దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి

బంగారం ధర ఎందుకు పెరిగింది?

బంగారం ధరల్లో ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కార‌ణం కావొచ్చు. గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎటువంటి పరిష్కారం లేకుండా కొనసాగుతోంది. వెనిజులా నుండి ముడి చమురు సరఫరాలో ఏర్పడే అడ్డంకులపై ఆందోళనలు నెలకొన్నాయి.

ఆఫ్రికాలో ISIS అనుబంధ గ్రూపులపై అమెరికా సైనిక చర్యల వార్తలు పెట్టుబడిదారులను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. ఇటువంటి అనిశ్చితి నెలకొన్న సమయంలో పెట్టుబడిదారులు ఈక్విటీ వంటి రిస్క్ ఉన్న రంగాల నుండి డబ్బును ఉపసంహరించుకుని బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇతర కారణాలు

వడ్డీ రేట్ల తగ్గింపు: అమెరికా సెంట్రల్ బ్యాంక్ (US Fed) వచ్చే ఏడాది కనీసం రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్ భావిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ల కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడానికే ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారు.

గోల్డ్ ETF: గోల్డ్ ETFలలో పెట్టుబడులు నిరంతరం పెరుగుతున్నాయి.

సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Gold Latest Rate
  • Gold Price Prediction
  • Gold Price Record High
  • Gold Rates

Related News

Rule Change

జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!

అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే ప్రక్రియ జనవరి నుండి ప్రారంభం కానుంది.

  • Credit Card

    మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?

  • Here are the details of AP-Telangana bank holidays in 2026.

    2026లో ఏపీ–తెలంగాణ బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే..

  • Saving Schemes

    రూ. లక్ష డిపాజిట్‌పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్‌లో అంటే?!

  • Jayshree Ullal

    ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవ‌రో తెలుసా?

Latest News

  • గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!

  • మ‌హిళ‌లు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!

  • టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్‌?!

  • ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర , కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకాడు

  • బంగారం ధరల రికార్డుల పరంపర.. 2026లో మరింత పెరిగే అవకాశం!

Trending News

    • క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌!

    • టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

    • న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

    • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd