Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది : ఇండియన్ ఎయిర్‌పోర్స్
వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది.
- By Latha Suma Published Date - 01:26 PM, Sun - 11 May 25

Operation Sindoor : ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ భారత వాయుసేన కీలక ప్రకటనను విడుదల చేసింది.‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని తెలిపింది ఈ ప్రకటన ‘ఎక్స్’ద్వారా చేసింది. వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది. దీనివల్ల దేశ రక్షణ వ్యవస్థ మరింత బలపడిందని, శత్రువుల కుట్రలకు కఠినంగా ప్రతిఘటించగలగే స్థాయికి చేరుకున్నామని వెల్లడించింది.
Read Also: TG EAPCET Results : తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అందువల్ల ఇప్పటికీ పూర్తి వివరాలను వెల్లడించలేమని వాయుసేన స్పష్టం చేసింది. అయినప్పటికీ, అవసరమైతే అధికారికంగా వివరాలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజలను తప్పుడు ప్రచారాలు, అపోహల నుండి దూరంగా ఉండాలని, అధికారిక వనరుల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని సూచించింది. ఈ ప్రకటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, వాయుసేన స్పందనతో వాటికి పాక్షికంగా చెక్ పడింది. ఇప్పటివరకు జరిగిన కార్యాచరణలపై స్పష్టత ఇవ్వనప్పటికీ, భారత రక్షణ వ్యవస్థ తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తోందన్న సంకేతాలను ఈ ప్రకటన అందిస్తోంది.
భారత వాయుసేన గతంలోనూ పుల్వామా దాడి అనంతరం బాలాకోట్‌పై జరిపిన వైమానిక దాడులతో ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఆపరేషన్ సిందూర్’ కూడా ఆ స్థాయిలో కీలకంగా మారే అవకాశముందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత రక్షణ వ్యవస్థ అత్యున్నత స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న సందేశాన్ని ఈ ప్రకటనతో ఇస్తోంది. ప్రజలు గందరగోళంలో పడకుండా, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని వాయుసేన మరోసారి విజ్ఞప్తి చేసింది.
Read Also: Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం