New Parliament Opening : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. మే 28న ?
మనదేశ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయ్యేది (New Parliament Opening) ఎప్పుడు ? అంటే.. ఈ నెలలోనే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
- Author : Pasha
Date : 16-05-2023 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
మనదేశ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయ్యేది (New Parliament Opening) ఎప్పుడు ? అంటే.. ఈ నెలలోనే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అయినప్పటికీ తన ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని (New Parliament Opening) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలుస్తోంది. 2014 మే 26న ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 2020 డిసెంబర్‌లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత 2020 అక్టోబర్ 1న భవన నిర్మాణం ప్రారంభమైంది.
also read : New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రధాని మోదీ!
కొత్త పార్లమెంట్ భవనంలో ఏమున్నాయి ?
రూ. 13,500 కోట్ల విలువైన సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ కొత్త పార్లమెంట్ భవనంలో పెద్ద హాళ్లు, లైబ్రరీ, పుష్కలంగా పార్కింగ్, కమిటీ రూమ్‌లు ఉంటాయి. హాల్ లు , కార్యాలయాలలో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ బడ్జెట్ రూ. 862 కోట్లు. కొత్త నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనంలో 1,224 మంది ఎంపీలు కూర్చునే సౌకర్యం ఉంటుంది. ఈ ప్రాజెక్టును నేరుగా పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ పూరి పర్యవేక్షిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD), TATA ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనిని నిర్వహిస్తున్నాయి.