Mahanadu : కార్యకర్తల నాటు దెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు.. అడ్రస్ లేకుండా పోయారు: మంత్రి లోకేశ్
తిరుమల తొలి గడప దేవుని కడప. ఇది పవిత్రమైన భూమి. ఒంటిమిట్ట, అమీన్‌పీర్ దర్గా వంటి మతపరమైన స్థలాలతో కలసి ఉన్న ఈ ప్రాంతం అనేక ఆధ్యాత్మిక వాచకాలను కలిగిఉంది అని నారా లోకేశ్ అన్నారు.
- By Latha Suma Published Date - 04:49 PM, Thu - 29 May 25

Mahanadu : మహానాడు బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. దేవుని కడపలో మహానాడు నిర్వహించడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మహానాడు బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఎనలేని ఉత్తేజాన్ని నింపింది. తిరుమల తొలి గడప దేవుని కడప. ఇది పవిత్రమైన భూమి. ఒంటిమిట్ట, అమీన్‌పీర్ దర్గా వంటి మతపరమైన స్థలాలతో కలసి ఉన్న ఈ ప్రాంతం అనేక ఆధ్యాత్మిక వాచకాలను కలిగిఉంది అని నారా లోకేశ్ అన్నారు. ఇది పౌరుషం, ఆత్మీయత, మహిళల పట్ల గౌరవం అనే విలువలు నేర్చుకునే గడ్డ. ఇక్కడ నిర్వహించిన మాస్ జాతర మహానాడు ప్రజల మన్ననలు పొందింది. పసుపు జెండా రెపరెపలాడిన ఘనత కడపకు దక్కింది అని పేర్కొన్నారు.
Read Also: UPI Transactions: యూపీఐ వాడేవారికి పిడుగులాంటి బ్యాడ్ న్యూస్.. ఏంటంటే?
2024 ఎన్నికల విజయాన్ని గుర్తుచేస్తూ మనం చరిత్రను తిరగరాశాం. 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించి టీడీపీ తిరుగులేని శక్తిగా నిలిచింది. కొంతమంది పార్టీ లేకుండా చేస్తాం అని ఊహించారు, కానీ వారే రాజకీయ రంగం నుంచి కనిపించరా లేరు. వైఎస్సార్‌సీపీ ‘వై నాట్ 175’ అన్నారు, కానీ ప్రజలు వారిని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా త్రోసి పెట్టారు అని ఎద్దేవా చేశారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయలేదు. అయినా జైల్లో పెట్టారు. కానీ ప్రజలు జగన్‌ను తాడేపల్లిలోని ప్యాలెస్‌లో బంధించారు. ఇది ప్రజల తీర్పు అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు.. ట్రెండ్ సెట్ చేస్తారు. అది సినిమా స్క్రీన్ అయినా..పొలిటికల్ స్క్రీన్ అయినా.. ఆయన ఒక లెజెండ్. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు..ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, కర్ణుడు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిందని పేర్కొంటూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్నవాటినే పక్క రాష్ట్రాలకు తరలించారు. మద్యం కారణంగా 30వేల మందిని కోల్పోయాం. కోట్ల రూపాయలు మద్యం ద్వారా లూటీ చేశారు అని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త దారి చూపిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రతి హామీని నిలబెట్టుకుంటాం అని నారా లోకేశ్ నొక్కిచెప్పారు.
సీబీఎన్ అంటే ప్రజలకు ధైర్యం అని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రధాన అజెండా అని చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్నవాటినీ ఇతర రాష్ట్రాలకు తరలించిందని చెప్పారు. మద్యం దుర్వినియోగంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు రక్షించేందుకు కూటమి ఏర్పడిందని, ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also: Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్