Sisodia : ఈనెల 30 వరకు మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
- Author : Latha Suma
Date : 15-05-2024 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడి(Judicial custody)ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది(extended). ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజులపాటు.. ఈ నెల 30 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు. తీహార్ జైల్‌లో ఉన్న మనీష్ సిసోడియాకు నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై దాఖలు చేసిన ఆప్పీల్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిసోడియాపై ఉన్న ఆరోపణలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) గతేడాది మార్చి 9న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తిహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీపై ఉంటున్నారు. గత నెల 30న సిసోడియాకు రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జడ్జి బవేజా కొట్టివేశారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని ఈడీ తెలిపింది.